Leading News Portal in Telugu

Cholesterol Diet: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఈ ఆహారం తీసుకోవాలి..!



Colestrol

మానవుడి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం జీవనశైలి, ఆహారం. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలున్నాయి.. ఒకటి చెడు కొలెస్ట్రాల్, ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకోసం ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోవడం వలన చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఎలాంటి ఆహారం తీసుకంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also: Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

క్వినోవా
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి క్వినోవా ఆరోగ్యకరమైన ఆహారం. ఉదయాన్నే టిఫిన్ లో క్వినోవాతో చేసిన ఫుడ్ తినడం వల్ల కడుపు నిండిపోతుంది. అందులో ఉండే.. ప్రోటీన్, డైటరీ ఫైబర్‌తో సహా అనేక పోషకాలను శరీరానికి అందిస్తుంది.

కూరగాయల సలాడ్ 
తాజా కూరగాయల సూప్, సలాడ్ లేదా స్మూతీ కూడా ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది కడుపు నింపడమే కాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిని, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Read Also: Viral Video: టాయిలెట్‌ గదిలో దెయ్యం వేషంలో ఓ వ్యక్తి.. వీడియో చూస్తే షాక్..!

ఇదిలా ఉంటే.. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం కూడా చాలా ముఖ్యం. అందుకోసం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. అయితే ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉంటే.. చెడు కొలస్ట్రాల్ ను తగ్గించవచ్చు. అవెంటంటే………..

గుడ్డు పచ్చసొన
తరుచుగా గుడ్లు తినడం వలన చెడు కొలెస్ట్రాల్‌ తయారవుతుంది. ఒక గుడ్డులో దాదాపు 186 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకోసమని ఎక్కువగా తినకుండ పరిమిత స్థాయిలో మాత్రమే తినాలి.

ప్రాసెస్ చేసిన ఆహారం
ప్రాసెస్ చేసిన ఆహారం చాలా అనారోగ్యకరమైనది. అందులో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది. ముఖ్యంగా పిజ్జా, బర్గర్, నూడిల్స్ వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.