Leading News Portal in Telugu

AP Reorganisation Act: రేపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాలపై చర్చ



Cm Jagan

రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం. ఈ సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరుకానున్నారు. ఈ మీటింగ్ లో ప్రస్తావనకు రానున్న అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో పాటు చీఫ్‌ సెక్రటరీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగింది.. విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.. అప్పుల్లో 58 శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు కేటాయించారు అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Vini Raman: టీమిండియా అభిమానులపై మ్యాక్స్వెల్ భార్య ఆగ్రహం.. తీవ్ర పదజాలంతో విసుర్లు

కానీ, రెవెన్యూ పరంగా 58 శాతం తెలంగాణకు, 42 శాతం ఏపీకి వచ్చిందని సీఎం జగన్ అన్నారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు, పోలవరంకు నిధుల రాకలో సమస్యలున్నాయి.. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు కూడా రాలేదు.. మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుంది అని ఏపీ సీఎం జగన్ ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టి పెట్టాలని సూచించారు. విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే కదా విభజన చట్టంలో హామీలు ఇచ్చారు.. దీని వల్ల రాష్ట్రానికి రెవెన్యూ రూపంలో చాలా నష్టం జరిగింది.. దీన్ని సర్దుబాటు చేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు హామీలు ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు.

Read Also: Captain Miller: జింకను వేటాడే పులి కళ్లు ఎలా ఉంటాయో.. అలా ఉన్నాయి సామీ

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పని సరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంది అని వైెఎస్ జగన్ వెల్లడించారు. అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది.. అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం.. ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత.. మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పలు రోడ్లు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం.. దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలి అని సీఎం జగన్ సూచించారు.

Read Also: RX 100 : మరోసారి రిపీట్ కానున్న ఆ సూపర్ హిట్ కాంబో..?

కడపలో స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం హామీ ఇచ్చింది అని సీఎం జగన్ తెలిపారు. స్టీల్‌ ప్లాంటుకు సమీప ప్రాంతంలో ఎన్‌ఎండీసీ నుంచి గనుల కేటాయింపు చేయాలి.. దీంతో ప్రతిపాదిత ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సులభతరం అవుతుంది.. విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం హై స్టీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం – వయా కర్నూలు మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలన్నారు. వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్‌ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తానన్నారు.. విశాఖపట్నంలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు తీవ్ర ఇబ్బంది వస్తోంది అని ఆయన సూచించారు.