Leading News Portal in Telugu

Mallikarjuna Kharge: ‘రాహుల్ దేశం కోసం చనిపోయాడు’.. ఇది ఎప్పుడు జరిగిందయ్యా..!



Mallikarjuna Kharge

Mallikarjuna Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తన తండ్రి రాజీవ్ గాంధీని ఉద్దేశించి రాహుల్ గాంధీ పేరును తప్పుగా పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ వెంటనే కాంగ్రెస్ నాయకుడిపై విరుచుకుపడడంతో పాటు ఎగతాళి చేసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. రాజస్థాన్‌లోని అనుప్‌గఢ్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ వంటి నాయకులు ఈ దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించారు’ అని అన్నారు.టంగ్‌ స్లిప్ గురించి ఎవరో వెంటనే ఖర్గేను అప్రమత్తం చేశారు. ఖర్గే వెంటనే తనను తాను సరిదిద్దుకున్నారు.

Also Read: Khalistani terrorist Pannun: ఎయిర్ ఇండియాను బెదిరించిన ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్‌పై ఎన్‌ఐఏ కేసు

“నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను పొరపాటుగా రాహుల్ గాంధీ అన్నాను.. రాజీవ్ గాంధీ జాతి ఐక్యత కోసం ప్రాణాలర్పించారు. కాంగ్రెస్‌లో దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకులు ఉన్నారు, బీజేపీలో ప్రాణాలు తీసుకునే నాయకులు ఉన్నారు” అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ విషయంపై “యే కబ్ హువా? (ఇది ఎప్పుడు జరిగింది?)” అనే శీర్షికతో బీజేపీ ఖర్గే వీడియో క్లిప్‌ను వారి ట్విట్టర్‌ (ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేసింది.200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.