Leading News Portal in Telugu

Local Boy Nani: యూట్యూబర్ లోకల్ బాయ్ నాని నిర్దోషి.. తేల్చేసిన పోలీసులు.. ?



Local Boy

Local Boy Nani: యూట్యూబర్ లోకల్ బాయ్ నాని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. బోట్ లో చేపలు పడుతూ.. ఫుడ్ వండుతూ.. సముద్ర అందాలను చూపిస్తూ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇతనిని చూసే.. దయ వెబ్ సిరీస్ లో ఒక పాత్రను కూడా మలిచారు. లోకల్ బాయ్ నానికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్‌లో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం నాని చేసిన పనే అని ఎంతోమంది అతనిని అనుమానించారు. తన భార్య సీమంతం పార్టీని బోట్ లో గ్రాండ్ గా నిర్వహించాడు. స్నేహతులను పిలిచి పార్టీ జరిపాడు. ఇక ఆ సమయంలోనే బోట్ కు నిప్పు అంటుకోవడం.. 60 నుంచి 70 బోట్ల వరకు కాళీ బూడిద అయ్యాయి. ఇక ఈ అగ్నిప్రమాదాన్ని సైతం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడంతో లోకల్ బాయ్ నానిపై కేసు నమోదయ్యింది. అగ్ని ప్రమాదం జరగడానికి కారణం కూడా ఇతనే అయ్యి ఉంటాడని అనుమానించిన పోలీసులు ఉదయం అతనిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

Akshara Haasan: కమల్ కూతురితో ప్రేమాయణం.. చివరికి ఆమెతో పెళ్లి

ఇక తాజాగా లోకల్ బాయ్ నానిని విచారించిన పోలీసులు.. ఈ అగ్నిప్రమాదానికి లోకల్ బాయ్ నాని కారణం కాదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. క్షుణ్ణంగా విచారించడమే కాకుండా విచారణ అనంతరం నాని స్టేట్మెంట్ తో పాటు.. సీసీ టీవి ఫుటేజ్ పరిశీలన తరువాత నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో సదురు యూట్యూబర్ దోషి కాదని తెలుస్తోంది. అసలు ఈ ఘటనకు అసలు కారణం ఎవరు అనేది తెలుసుకోవడానికి పోలీసులు విచారిస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా త్వరలోనే తెలపాలని లోకల్ బాయ్ నాని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.