Leading News Portal in Telugu

Plane Crash: సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం.. వీడియో వైరల్!



Kaneohe Bay Plane Crash

Kaneohe Bay Plane Crash: అమెరికా నౌకాదళానికి చెందిన ఓ నిఘా విమానం రన్‌వే నుంచి అదుపుతప్పి.. సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం హవాయిలో చోటుచేసుకొంది. ప్రమాద సమయంలో విమానంలో తొమ్మిది మంది సిబ్బంది ఉండగా.. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. సముద్రంలో బోటింగ్‌ చేస్తున్నవారు విమానం నీటిపై తేలడం చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హవాయి న్యూస్ నౌ ప్రకారం.. బోయింగ్ P-8 పోసిడాన్ లాగా కనిపించే భారీ నిఘా విమానం హవాయిలోని కనోహే బే నీటిలో తేలుతూ కనిపించింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రన్‌వే నుంచి అదుపుతప్పిన విమానం సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనకు కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. అయితే విమానం నీటిలోకి దూసుకెళ్లినా ఎలాంటి డామేజ్ కాలేదట. ఈ ప్రమాద విషయాన్ని మెరైన్‌ కోర్‌ బేస్‌ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్‌ ధ్రువీకరించారు.

Also Read: David Warner: భార‌త అభిమానులు క్షమించండి.. డేవిడ్ వార్న‌ర్ ట్వీట్ వైర‌ల్!

అమెరికా నౌకాదళంలో పీ-8ఏ పొసెడాన్‌ విమానం కీలక పాత్ర పోషిస్తోంది. సాధారణంగా వీటిని జలాంతర్గాముల కోసం వేటాడేందుకు ఉపయోగిస్తారు. ఇది సబ్‌మెరైన్లను గాలించి వాటిపై దాడి చేయడమే కాకూండా.. భారీగా ఇంటెలిజెన్స్‌ను కూడా సేకరించగలదు. టోర్పెడోలు, క్రూజ్‌ క్షిపణులను కూడా ఇది తీసుకెళ్లగలదు. ఈ విమానాన్ని నిర్వహించే పెట్రోల్‌ స్క్వాడ్రన్‌.. కనోహె బే కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచంలో పీ8 విమానాలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బ్రిటన్‌, నార్వే, భారత్‌ సైన్యాలు వాడుతున్నాయి.