Leading News Portal in Telugu

National Herald case: రాహుల్, సోనియాగాంధీలకు ఈడీ షాక్.. రూ. 752 కోట్ల ఆస్తులు సీజ్..



National Herald Case

National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన రూ. 90 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అలాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఢిల్లీ, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌజ్‌లు, లక్నోలోని నెహ్రూ భవన్ ఉన్నాయి. అసోసియేటెడ్ జర్నల్‌కి చెందిన జప్తు చేసిన ఆస్తుల విలువ రూ. 752 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.

పీఎంఎల్ఏ 2002 కింద దర్యాప్తు సంస్థ మనీలాండరింగ్ కేసులో 751.9 కోట్ల విలువైన ఆస్తుల్ని తాత్కాలికంగా అటాచ్ చేయాలని ఈడీ ఉత్తర్వులను జారీ చేసింది. ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలతో పాటు ఇండియాలోని అనేక నగరాల్లోని రూ.661.69 కోట్ల విలువైన స్థిరాస్తులను, ఈక్విటీ షేర్లలో పెట్టుబడి రూపంలో ఉన్న రూ. 90.21 కోట్లను ఈడీ అటాచ్ చేసింది.

Read Also: Uttar Pradesh: బెడ్రూం వీడియోలు బయటపెడతానని పోలీసుని బ్లాక్‌మెయిల్ చేసిన భార్య..

దీనిపై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ స్పందించారు. ఈడీ ద్వారా ఏజేఎల్ ఆస్తుల అటాక్‌మెంట్, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి దృష్టిని మరల్చేందుకే అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మనీలాండరింగ్‌కి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, రాజకీయ ప్రతీకారం కోసమే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పలుమార్లు ఆరోపించింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వార్తా పత్రికను నిర్వహించే అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ కొనుగోలు మోసం, కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ప్రశ్నించింది.