Leading News Portal in Telugu

Sara Tendulkar: ప్రభాస్ కోసం వెయిటింగ్.. అయ్యబాబోయ్.. సారా.. నువ్వు కూడానా



Sara

Sara Tendulkar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారుంటారా.. ? బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రభాస్ చేతిలో దాదాపు ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఇక అందులో ఒకటి సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ షురూ చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 1 న సలార్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ ట్రైలర్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా అంతే ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Swathi Deekshith: రూ. 30 కోట్ల ఇల్లు కబ్జా.. నటి స్వాతి దీక్షిత్ పై కేసు

తాజాగా క్రికెట్ కింగ్ సచిన్ టెండూల్కర్.. ముద్దుల తనయ సారా టెండూల్కర్ కూడా సలార్ ట్రైలర్ కోసమే ఎదురుచూస్తున్నాను అని చెప్పడం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ భామ.. సలార్ పోస్టర్ ను షేర్ చేస్తూ.. సలార్ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చింది. ఇక సారా ట్వీట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ అసెంబుల్ అయ్యారు. అయ్యబాబోయ్.. సారా.. నువ్వు కూడా ప్రభాస్ ఫ్యాన్ యేనా.. సూపర్.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సారా అందం గురించి చెప్పనవసరం లేదు. అప్పుడెప్పుడో ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అని వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ పుకార్లే అని సమాచారం. ఇక యువ క్రికెటర్ శుభమన్ గిల్ తో సారా డేటింగ్ వార్తలు వాటికి మించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలో పెళ్లి కూడా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సారా స్పందించింది లేదు. మరి వీరి పెళ్లి వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే సారా నిజం చెప్పవరకు ఆగాల్సిందే.