
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో జవాన్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్గా నటించారు.. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్స్ గా నటించారు..జవాన్ సినిమా లో ప్రియమణి, సన్యా మల్హోత్రా మరియు సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోం బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌరీఖాన్ తెరకెక్కించింది. ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసి హీరోగా షారుఖ్ ఖాన్ సంచలనం సృష్టించాడు.
ఈ ఏడాది ప్రారంభం లో ‘పఠాన్’ సినిమా తో కలెక్షన్ ల సునామి సృష్టించిన షారుఖ్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా తో కలెక్షన్ల మోత మోగించారు. ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘జవాన్’ సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. సుమారు రూ.1068 కోట్లకుపైగా వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సినీ చరిత్రలో అత్యధిక గ్రాస్ సాధించిన హిందీ సినిమా గా కూడా ‘జవాన్’ రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.జవాన్ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 2 వ తేదీన ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం.. తొలి రెండు వారాల్లోనే అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది. ఏ సినిమా క్రియేట్ చేయలేని అరుదైన రికార్డు ను జవాన్ మూవీ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇండియా తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘విక్రమ్ రాథోడ్ మా హృదయాలను, రికార్డులను హైజాక్ చేశారు..! నెట్ఫ్లిక్స్లో అన్ని భాషల్లో విడుదలైన మొదటి 2 వారాల్లో భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన చిత్రం గా జవాన్’ సినిమా నిలిచింది అంటూ ట్వీట్ చేసింది.