Leading News Portal in Telugu

LIC Policy : అదిరిపోయే పాలసీ.. రూ.182 పొదుపు చేస్తే రూ.16 లక్షలు మీ సొంతం..



Lic (2)

ప్రముఖ బీమా కంపెనీ ఎల్ఐసీ లో ఎన్నో అద్భుతమైన పాలసీలు ఉన్నాయి.. అందులో ఒకటి జీవన్ సరళ ప్లాన్.. ఈ ప్లాన్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. ఇది నాన్ లింకెడ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ. దీనిలో సంరక్షణతో పాటు సేవింగ్స్ కూడా ఖాతాదారులు చేసుకోవచ్చు. అంటే డెత్ బెనిఫిట్స్ తో పాటు మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో నగదు కూడా పొందొచ్చు.. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఎల్‌ఐసీ జీవన్ సరళ్ ప్లాన్ లో పాలసీదారు అకాల మరణం చెందితే కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. డెత్ బెనిఫిట్ అనేది సమ్ అష్యూర్డ్ ప్లస్ రివర్షనరీ బోనస్‌లు, టెర్మినల్ బోనస్‌లకు సమానం. పాలసీదారుని కుటుంబం వారు లేనప్పుడు కూడా ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా భరోసా ఇస్తుంది.. ప్రీమియం చెల్లింపు ఎంపికలలో సౌలభ్యం. పాలసీదారులు తమ సౌలభ్యం ఆధారంగా వార్షికంగా, అర్ధ-సంవత్సరానికి, త్రైమాసిక లేదా నెలవారీ ప్రీమియం చెల్లింపు ఫ్రీక్వెన్సీని ఎంచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ ప్లాన్ ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా ప్రీమియం చెల్లింపు ఎంపికను కూడా అందిస్తుంది..

ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ఎల్‌ఐసి జీవన్ సరళ్‌కు రూ. 10 లక్షలుబీమా మొత్తంతో దరఖాస్తు చేసుకున్నాడనుకుందాం. 15 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధి. అతను 20 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకున్నాడు. 15 సంవత్సరాల తర్వాత, రవి మెచ్యూరిటీ మొత్తాన్ని దాదాపు రూ. 16 లక్షలను సొంతం చేసుకోవచ్చు.. బీమా మొత్తం రూ. 10 లక్షలు, బోనస్ రూ.6 లక్షల వరకు ఉంటుంది.. ఏదైనా ప్రమాదం వల్ల పాలసీ దారుడు మరణిస్తే ఆ ప్రయోజనం మొత్తం అతని కుటుంబానికి ఇస్తారు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు..