
పాయల్ రాజ్పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం.. ఈ సినిమా నవంబర్ 17 న గ్రాండ్ గా విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ మూవీని తెరకెక్కించారు…విడుదల నాటి నుంచి ఇప్పటి వరకూ ఈ సినిమా రూ.14 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఈ కలెక్షన్లతో మేకర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేయగా.. ఇక నుంచి వచ్చే కలెక్షన్లీ కూడా లాభాలే అనుకోవచ్చు.అయితే మొదటిలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. మంచి ఓపెనింగ్స్ కూడా లభించాయి. అయితే మూడో రోజు అయిన ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ కారణంగా మంగళవారం సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది. ఆ రోజు కేవలం రూ.కోటి మాత్రమే వసూలు చేసింది.
వరల్డ్ కప్ ప్రభావం పడకపోయినట్లయితే ఈ మూవీ కలెక్షన్లు మరింత భారీగా ఉండేవి.ఈ సినిమా ఊహించినదాని కంటే పెద్ద సక్సెస్ కావడంతో మంగళవారమే (నవంబర్ 21) మంగళవారం టీమ్ సక్సెస్ పార్టీ కూడా చేసుకుంది. ఈ సందర్భంగా మూవీలో ప్రత్యేక పాత్ర పోషించిన ప్రియదర్శిని క్యారెక్టర్ ను కూడా చిత్ర యూనిట్ పరిచయం చేశారు. ఓ ఊరిలో ప్రతి మంగళవారం జరిగే అనూహ్య సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది.ఈ సినిమాలో పాయల్ ఓ బోల్డ్ పాత్రలో నటించింది. అజయ్ భూపతి డైరెక్షన్ లోనే వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ గ్లామర్ తో ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాలసిన పని లేదు. మంగళవారం సినిమా లో కూడా పాయల్ పాత్ర ఎంతో భిన్నం గా ఉంటుంది. ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు.. తాజాగా మంగళవారం మూవీ ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకోగా డిసెంబర్ రెండో వారం నుంచి ఈ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..