
PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ… ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాది ప్రధాని నరేంద్రమోడీ మరోసారి నొక్కి చెప్పారు. బుధవారం జీ 20 సమ్మిట్ వర్చువల్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు జీ 20 సభ్య దేశాలతో కలిసి నడవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇజ్రాయిల్- హమాస్ మధ్య బందీల విడుదల ఒప్పందాన్ని ప్రధాని మోడీ స్వాగతించారు.
ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ నేను ఈ వర్చువల్ సమ్మిట్ ప్రతిపాదించిన సమయంలో ఈ రోజు ప్రపంచ పరిస్థితి ఇలా ఉంటుందని ఊహించలేదు. గత కొన్ని నెలల్లో కొత్త సవాళ్లు ఎదురయ్యాయి’’ అని అన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో అభద్రతన, అస్థిరత పరిస్థితులు మనందరికి ఆందోలన కలిగించే విషయమని అన్నారు. సంక్షోభాన్ని పశ్చిమాసియా ప్రాంతం అంతటికి పాకకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: Question Hour with RS Praveen Kumar Exclusive LIVE: ఎన్టీవీ లైవ్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఇజ్రాయిల్-హమాస్ మరణాల గురించి మాట్లాడుతూ.. పౌరుల మరణాలు ఖండించదగినవేనని, అలాగే ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని, దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పారు. బందీల విడుదలను స్వాగతిస్తూ.. యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతానికి మానవతా సాయాన్ని సకాలంలో అందించాలని కూడా ప్రధాని చెప్పారు.
అక్టోబర్ 7 నాటి దాడుల్లో హమాస్ ఉగ్రవాదులు 1200 మందిని చంపడంతో పాటు ఇజ్రాయిల్ లోని 26 దేశాలకు చెందిన 240 మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లారు. వీరి విడుదలపై ప్రస్తుతం ఒప్పందం కుదిరింది. ఇజ్రాయిల్ పాలస్తీనాకు చెందిన 150 మంది ఖైదీలను నాలుగు రోజుల్లో నాలుగు దశల్లో విడుదల చేస్తామని చెప్పింది, అందుకు ప్రతీగా ప్రతీ రోజు 10 మందిని మొత్తంగా 50 మంది ఇజ్రాయిల్ బందీలను అప్పగించనున్నారు.