Leading News Portal in Telugu

Izzat Song: సుమ కొడుకు సినిమా సాంగ్ ని లాంచ్ చేసిన మెగాస్టార్…



Izzat

యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా ‘బబుల్ గమ్’. కృష్ణ అండ్ హిస్ లీల, క్షణం లాంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన రవికాంత్ పేరేపు ‘బబుల్ గమ్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 29న రిలీజ్ కానున్న బబుల్ గమ్ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని చిత్ర యూనిట్ విడుదల చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి బబుల్ గమ్ సినిమా నుంచి ఒక సాంగ్ ని లాంచ్ చేసాడు. ఇజ్జత్ అంటూ సాగే సాంగ్ లో మంచి ఎనర్జీ ఉంది.

Read Also: Mahesh: క్రిటిక్ ప్రూఫ్… 50 డేస్ లో సూపర్ స్టార్ ని కాదు “సూపర్ స్ట్రామ్” ని చూస్తారు

ర్యాప్ సాంగ్ గా బయటకి వచ్చిన ఇజ్జత్ పాటలో రోషన్ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ సాంగ్ ని శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేయగా హరి లిరిక్స్ రాసి సాంగ్ పాడాడు. తెలంగాణ, హైదరాబాద్ యూత్ స్టైల్ లో ఉన్న ఈ సాంగ్ లో రోషన్ డాన్స్ కూడా చాలా బాగా చేసాడు. హుక్ స్టెప్ రీల్స్ లో వైరల్ అయ్యేలా ఉంది. మరి ఈ సినిమా రోషన్ కి హీరోగా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.