Leading News Portal in Telugu

Conflict: బ్రెజిల్, అర్జెంటీనా ఫుట్‌బాల్ మ్యాచ్‌.. బయట పోలీసుల లార్టీ ఛార్జ్



Untitled 26

Brazil-Argentina football match: క్రీడల్లో క్రికెట్ మొదటి స్థానంలో ఉంటె రెండవ స్థానంలో ఫుట్‌బాల్ ఉంది. ఈ క్రీడలను ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారంటే సినిమా హీరోలకు ఏమాత్రం తీసి పోకుండా ఈ క్రీడలు ఆడే క్రీడాకారులకు అభిమానులు ఉంటారు. ఇక ఫుట్‌బాల్ మ్యాచ్‌ బ్రెజిల్, అర్జెంటీనా మధ్య జరుగుతుంటే ఆ ప్రాంతంలో వాతావరణం వాడి వేడి మీద ఉంటుంది. గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుంటే గ్రౌండ్ బయట ఇరు జట్ల అభిమానుల మధ్య వార్ జరిగిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా మరోసారి వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. మంగళవారం రాత్రి FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ బ్రెజిల్ మరియు అర్జెంటీనా మధ్య జరిగింది.

Read also:Shabbir Ali: కేసీఆర్ కమీషన్ల పనులు తప్ప.. పేదలకు ఉపయోగపడేవి చేశాడా? షబ్బీర్ అలీ ఫైర్

అయితే మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు జాతీయ గీతం వేడుకలో ఇరు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనితో బ్రెజిలియన్ పోలీసులు రంగ ప్రవేశం చేసారు. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణాన్ని నియంత్రణ లోకి తీసుకు రావడానికి అర్జెంటీనా అభిమానుల పైన బ్రెజిలియన్ పోలీసులు లార్టీ ఛార్జ్ చేసారు. ఈ నేపథ్యంలో అభిమానులు పోలీస్ లార్టీ చార్జ్ నుండి తప్పించుకునే ప్రయతనం చేసారు. ఈ క్రమంలో కొందరు పిచ్‌ లోకి ప్రవేశించారు. మరి కొందరు స్టేడియం లోని సీట్లను తీసి అధికారుల పైకి విసిరారు. కాగా పోలీసుల లార్టీ ఛార్జ్ లో పలువురికి గాయాలు అయ్యాయి.

Read also:Jammu Encounter: రాజౌరిలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌… ఒక ఉగ్రవాది.. నలుగురు జవాన్లు మృతి

ఓ వ్యక్తికి తలపగిలి రక్తం కారసాగింది. దీనితో ఆ వ్యక్తిని అత్యవసర సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. దీనితో ఆ ప్రాంతంలో భీకర వాతావరణం నెలకొంది. కాగా కెప్టెన్ లియోనెల్ మెస్సీ నేతృత్వం లోని అర్జెంటీనా జట్టు గ్రౌండ్ నుండి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయింది. దీనితో మ్యాచ్ అరగంట ఆలస్యంగా మొదలయింది. అయితే గ్రౌండ్ లో అర్జెంటీనా ఆటగాళ్లు రెచ్చిపోయారు. బ్రెజిల్ జట్టు పైన అర్జెంటీనా 1-0 ఆధిపత్యంతో విజయం సాధించి అభిమానులకు సంతోషాన్ని అందించింది.