Leading News Portal in Telugu

V Srinivasa Rao: ప్రమాదంలో యువత..! గంజాయి నిర్మూలనకు స్పెషల్ పార్టీ వేయండి..!



V Srinivasa Rao

V Srinivasa Rao: గంజాయికి యువత అలవాటుపడుతోంది.. గంజాయి చలామణి చేసే వారికి సపోర్టు ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు స్పెషల్ పార్టీ వేయాలని డిమాండ్‌ చేశారు. నార్కోటిక్స్ బోర్డు ప్రచారం కోసం ప్రకటనలు చేస్తోంది.. గంజాయి ఉత్పత్తి కేంద్రాల వెనుక పలుకుబడి ఉన్న వ్యక్తులున్నారు అని విమర్శించారు. ఇక, రాష్ట్రంలో కరువు లేదని చెప్పడానికే కరువు ప్రాంతాలు వాస్తవంగా ప్రకటించడం లేదు.. కేంద్రం కరువు ప్రాంతాల నిర్ధారణపై బృందాలను పంపకుండా నిద్రపోతోంది అని మండిపడ్డారు.

Read Also: Kishan Reddy: సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ చీఫ్ బహిరంగ లేఖ

మరోవైపు.. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో కూడా మిలిటెంట్ ఆర్గనైజేషన్ లు ఉన్నాయి.. నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ కలిసి సియోనిజమ్ ను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల కాల్పుల విరమణకు పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ఒప్పందం జరిగిందని తెలిసింది.. పాలస్తీనా అంశంపై పలువురు పలు రచనలు చేసారు.. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి పాలస్తీనా కూడా బ్రిటిష్ హస్తాల్లో ఉండేది.. 1938, 1948 లలో పాలస్తీనా గురించి మహాత్మాగాంధీ మాట్లాడారని తెలిపారు.. అయితే, పాలస్తీనా స్వతంత్ర పోరాటం చేస్తోంది ఇప్పుడన్నారు.. వ్యవసాయ ఆధారిత 58 శాతం స్ధలం ఇజ్రాయిల్ కు వచ్చింది.. పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్ గా పోరాటం జరిగిందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి.