Leading News Portal in Telugu

Mansoor Ali Khan: మన్సూర్ కు షాక్ ఇచ్చిన కోర్ట్.. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు



Mansoor

Mansoor Ali Khan: మన్సూర్ ఆలీఖాన్.. సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకున్నాడో తెలియదు కానీ, వివాదాల ద్వారా మాత్రం బాగా ఫేమస్ అయ్యాడు. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు అతని గురించే మాట్లాడుతుంది అంటే అతిశయోక్తి కాదు. హీరోయిన్ త్రిష పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఇండస్ట్రీ టార్గెట్ గా మారాడు. లియో సినిమాలో త్రిషను రేప్ చేసే సన్నివేశం ఉంటుంది అనుకున్నాను అని ఇంటర్వ్యూలో మాట్లాడివివాదాన్ని సృష్టించిన మన్సూర్.. తప్పు చేసినట్లు ఒప్పుకోకుండా.. త్రిష, నా ఫోటోలు పక్క పక్కన పెట్టి వార్తలు రాస్తుంటే.. మా ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు అనిపిస్తుందని మరింత నీచంగా మాట్లాడి షాక్ ఇచ్చాడు. ఇక దీంతో మన్సూర్ తన వైఖరిని మార్చుకోడని అర్థమై.. తమిళ్ నడిగర్ సంఘం అతనిని తాత్కాలికంగా బ్యాన్ చేసింది. ఇంకోపక్క పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మన్సూర్ ను కోర్టు లో హాజరు పరిచారు. ఇక కోర్ట్ లో బెయిల్ కావాలంటూ మన్సూర్ మరో పిటిషన్ దాఖలు చేశాడు.

Israel: అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్, డాక్టర్లను అరెస్ట్ చేసిన ఇజ్రాయిల్..

ఇక ఈ కేసులో చెన్నైలోని థౌజండ్ ఐలాండ్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో నేడు విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యాడు. ఇక కోర్టు.. మన్సూర్ కు షాక్ ఇచ్చింది. బెయిల్ ను తిరస్కరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దానికి కారణం.. అతను దాఖలు చేసిన పిటిషన్ లో తప్పులు ఉన్నట్లు కోర్టు గుర్తించడమే. పిటిషన్ సరిగ్గా పెట్టడం కూడా రాకుండా బెయిల్ ఎలా మంజూరు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు.. మన్సూర్ ను హెచ్చరించింది. ప్రస్తుతం మన్సూర్ పై ఉన్న కేసు ఇంకా విచారణలోనే ఉంది. మరి ముందు ముందు ఈ కేసు ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.