
Odisha: ఒడిశాలోని గంజాం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అక్టోబరు 7న ఓ మహిళ, ఆమె రెండేళ్ల కుమార్తె తమ ఇంట్లో శవమై కనిపించారు. పాము కాటు వల్లే ఇద్దరూ చనిపోయారని తెలిసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాము కాటు వల్లే మహిళ, ఆమె కూతురు చనిపోయారని, అయితే ఇది సాధారణ మరణం కాదని పోలీసులు వెల్లడించారు. ఎందుకంటే, మహిళ భర్త ఇంట్లో విషపూరిత పామును వదిలివేయడంతో, దాని కాటు కారణంగా వారిద్దరూ మరణించారు.
Read Also:Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
అసలు విషయం గంజాం జిల్లా కబీసూర్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధిబరగా గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడిని కె గణేష్ పాత్రగా గుర్తించారు. మూడేళ్ల క్రితం అధేబరా గ్రామానికి చెందిన కె గణేష్ పాత్ర అదే గ్రామానికి చెందిన బసంతి పాత్రను వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివాహానంతరం వారికి ఒక కూతురు పుట్టింది. పాము ఇద్దరినీ కాటేసింది. వారి ఆరోగ్యం క్షీణించడంతో బసంతి, రెండేళ్ల చిన్నారిని హింజిలికట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరూ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వారిద్దరినీ హత్య చేసి ఉంటారని అనుమానించిన బసంతి కుటుంబీకులు అల్లుడు గణేష్‌పై హత్య కేసు నమోదు చేశారు.
Read Also:Revanth Reddy: నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం..
కవిసూర్యనగర్ ఐఐసి ప్రభాత్ కుమార్ సాహు మాట్లాడుతూ, సంఘటన జరిగిన రోజు రాత్రి పామును కుటుంబ సభ్యులు చంపారు. మహిళ, ఆమె కుమార్తె పోస్ట్ మార్టం నివేదిక కూడా వారు పాము కాటు కారణంగా మరణించినట్లు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. గణేష్‌ను కూడా విచారించారు. ఈ సమయంలో గణేష్ తన భార్య, కుమార్తెను హత్య చేసినట్లు అంగీకరించాడు. నాగుపామును కొని ఇంట్లో వదిలేశానని గణేష్ పోలీసులకు తెలిపాడు. పాము కాటుతో భార్య, కూతురు చనిపోతారని భావించాడు. ఎక్కడి నుంచో పాము ఇంట్లోకి వచ్చిందని, దాని కాటు వల్లే భార్య, కూతురు చనిపోయి ఉంటారని అందరూ అనుకుంటున్నారు. కానీ నిందుతుడు తన పై అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు.