
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో ఆ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. మొదటి సినిమాకే పాజిటివ్ టాక్ ను అందుకున్న హీరో తర్వాత వచ్చిన కొండపోలం సినిమాతో యావరేజ్ టాక్ ను అందుకున్నాడు.. ఇక ఇప్పుడు ఊర మాస్ యాక్షన్ స్టోరీతో అడియన్స్ ముందుకు వచ్చాడు వైష్ణవ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోరో స్ బ్యానర్లపై నిర్మతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ఆదికేశవ. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు.
ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగించగా.. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈరోజు ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది.. సినిమా ఎలాంటి టాక్ ను అందుకున్నాడో ట్విట్టర్ రివ్యూను చూద్దాం.. ప్రస్తుతానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
సినిమా ఫస్ట్ హాస్ సరదాగా.. కామెడీతో అలరిస్తుందని.. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మాస్ యాక్షన్ తో వైష్ణవ్ అదరగొట్టేశారని అంటున్నారు. ఇక శ్రీలీల డాన్స్ ఎనర్జీ గురించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ సింహాద్రి, అల్లు అర్జున్ అల వైకుంటపురంలో లోని హిట్ పాటలకు శ్రీలీల డాన్స్ వేరేలెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. పబ్లిక్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది.. దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
NTR’s @tarak9999 ALL TIME INDUSTRY HIT #Simhadri4K
Song Reference in #Adikesava
Leela Papa Dance @sreeleela14
pic.twitter.com/BZTF6bwZNf
— DINESH
.. (@_dinu4tarak) November 23, 2023
@maheshpupa can’t wait to watch this movie #aadikesava his excitement is next level
— Nanifangirl (@Pravee_Nani) November 23, 2023