
Kerala: అమ్మను మించిన యోధులు ఎవరు ఉండరు. ఎందుకంటే కనిపించే దేవత అమ్మ. బిడ్డల ఆకలిని చెప్పకుండానే తెలుసుకుంటుంది. తన పిల్లలే కాదు ఏ పిల్లలు ఆకలితో ఉన్న చూడలేదు అమ్మ అని నిరూపించింది ఓ కానిస్టేబుల్. కన్న తల్లి గుండె జబ్బుతో ఆసుపత్రి బెడ్ పైన ఉంది. అయితే ఆమె నలుగురు పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ పిల్లలను స్టేషన్ కి తీసుకెళ్లారు. ఈ నేపధ్యంలో ఆ పిల్లల్లో ఓ పసి పాప కూడా ఉంది. ఆ పసి పాపా ఆకలి ఏడుపుకు చలించిపోయిన లేడీ కానిస్టేబుల్ తనకు పాలిచ్చి ఆకలి తీర్చింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.
Read also:Rahul Gandhi: తగ్గేదేలే అంటున్న రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీ ‘పనౌటీ-ఎ-ఆజం’ అట
వివరాలలోకి వెళ్తే.. పాట్నాకు చెందిన వలస కార్మికురాలికి ఐదుగురు పిల్లలు. కాగా వారిలో ఒకరు పట్నా లోనె ఉన్నారు. మిగిలిన నలుగురు పిల్లలు తల్లితో ఉన్నారు. గోరు చుట్టూ మీద రోకలి పోటు అన్నట్లు అనారోగ్యంతో ఉన్న ఆమెకు తన భర్త కూడా దగ్గర లేరు. ఓ నేరంపై కొచ్చి లోనే జైలులో ఉన్నారు ఆమె భర్త. ఇంతలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి హార్ట్‌లో వాల్వ్ సమస్య ఏర్పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. దేనితో ఆమె పిల్లలు దిక్కులేని స్థితిలో బిక్కుబిక్కుమని ఆ ఆసుపత్రిలో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సుపత్రి సిబ్బంది కొచ్చి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి విషయం తెలియ చేశారు.
Read also:Mynampally Hanumanth Rao: కల్వకుంట్ల కుటుంబం మాటల గారడీ ఇక చెల్లదు..
దీనితో ఆసుపత్రికి చేరుకున్న పోలీసు సిబ్బంది ఆ పిల్లలను స్టేషన్ కి తీసుకెళ్లి ఆహరం అందించారు. అయితే ఆ పిల్లల్లో నాలుగు నెలల పసి పాప కూడా ఉంది. ఆ పసి పాపను చూసి చలించి పోయిన కానిస్టేబుల్ శైలజ పై అధికారికి ఆ విషయం చెబుతూ ఆ చిన్నారికి తాను పాలిస్తానని చెప్పారు. దానికి ఆ అధికారి అంగీకరించడంతో ఆ పాపకు పాలు పట్టారు శైలజ. ఈ నేపథ్యంలో శైలజ మాట్లాడుతూ నాకు 9 నెలల పాప ఉందని.. ఆకలితో ఏడుస్తున్న ఆ చిన్నారికి పాలిచ్చి ఆకలి తీర్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కానిస్టేబుల్ శైలజ చేసిన పనికి అందరూ ఆమె పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.