
Navdeep Saini got married his girlfriend Swati Asthana: ఈ ఏడాది భారత క్రికెట్ జట్టులో వరుసగా పెండ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ వివాహం చేసుకోగా.. తాజాగా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ పెళ్లి చేసుకున్నాడు. హర్యానాకు చెందిన సైనీ.. తన ప్రేయసి స్వాతి ఆస్థానని శుక్రవారం వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి కొద్దిమంది అతిథులు మాత్రమే ఆహాజరయ్యారు. పెళ్లి ఫొటోలను సైనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
‘నీతో ప్రతిరోజు ప్రేమతో నిండినదే. ఈరోజుతో మనం ఆ ప్రేమను శాశ్వతం చేస్తున్నాం. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ శుభ సమయంలో మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము’ అని నవ్‌దీప్ సైనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ఆ ఫొటోలకు చూసిన క్రికెటర్లు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సైనీ, స్వాతి గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. సైనీ క్రికెటర్ కాగా.. స్వాతి ఒక వ్లాగర్. ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్‌స్టయిల్ గురించి ఆమె ఆన్‌లైన్‌లో వీడియోలు పెడుతుంటారు.
Also Read: iQoo 12 5G Launch: ఆండ్రాయిడ్ ఫన్‌టచ్ ఓఎస్ 14తో ఐకూ కొత్త ఫోన్!
ఐపీఎల్ టోర్నీలో రాణించిన నవ్‌దీప్ సైనీ.. 2019లో టీ20ల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆపై భారత వన్డే, టెస్టు జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో చివరిసారి భారత్ తరఫున సైనీ టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్.. ఇరానీ కప్ గెలవడంలో సైనీ కీలకపాత్ర పోషించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో ఢిల్లీ తరఫున ఆడాడు. భారత్ తరఫున సైనీ 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టీ20 మ్యాచులు ఆడాడు. పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు.
View this post on Instagram