Leading News Portal in Telugu

Chelluboina Venugopal: కుల గణన ప్రక్రియ వాయిదా..



Chelluboina Venu

Chelluboina Venugopal: కుల గణన ప్రక్రియ వాయిదా పడిందని.. ఈ నెల 27కు బదులు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ వెల్లడించారు. పేదల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకే కులగణన అంటూ ఆయన పేర్కొన్నారు. కుల గణనపై జిల్లా, రీజినల్ స్థాయిల్లో కుల పెద్దలతో సమావేశాలు ముగిశాయన్నారు. కుల సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. మండల స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అందుకే కుల గణనను వాయిదా వేశామని స్పష్టం చేశారు. ఎక్కువ మంది అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ముందుకెళ్తామన్నారు. కుల గణనపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బీసీల తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తానని చంద్రబాబు అన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను అక్కున చేర్చుకున్నారని కామెంట్స్‌ చేశారు. సామాజిక సాధికారతకు సీఎం జగన్‌ చిరునామా అని వ్యాఖ్యలు చేశారు.

Also Read: Seediri Appalaraju: విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష.. ఇక అక్కడి నుంచే పాలన!

కులాలవారీగా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు?. వారి జీవన స్థితి ఎలా ఉందని తేల్చాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉందన్నారు. సామాజిక సాధికారతకు చిరునామా ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ, మండలి, పార్లమెంట్‌లో సీఎం జగన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారని మంత్రి తెలిపారు. మహిళలకు సగం రిజర్వేషన్‌ కల్పించారు. సోషల్ జస్టిస్ ఆచరించటంలో సీఎం జగన్ విజయం సాధించారని మంత్రి వెల్లడించారు.