Leading News Portal in Telugu

Randeep Hooda: నటితో సీక్రెట్ డేటింగ్.. 47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్న హీరో..



Randeep Hooda

బాలీవుడ్ సీనియర్ హీరో, సుస్మితా సేన్ మాజీ ప్రియుడు రణ్‌దీప్ హుడా లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌తో నవంబర్ 29న పెళ్లాడబోతున్నాడు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఫైనల్‌‌గా మూడుమూళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మణీపూర్‌లో వీరి వివాహ వేడుక జరగనుంది. అయితే కొన్నేళ్లుగా వీరి రిలేషన్‌పై గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ రణ్‌దీప్, లిన్ మాత్రం తమ రిలేషన్‌పై పెదవి విప్పలేదు.

తమ ప్రేమయాణాన్ని సీక్రెట్‌‌‌గా ఉంచిన ఈ లవ్‌బర్డ్స్ గత నెల దీపావళికి పండుగ సందర్భంగా తమ రిలేషన్‌ను ఆఫిషియల్ చేశారు. అనంతరం ఈ నెల 29న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం రణ్‌దీప్ అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో ఇలియానాతో కలిసి నటిస్తున్నారు. ఆ తర్వాత స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మరోవైపు లిన్ చివరిసారిగా కరీనా కపూర్, విజయ్ వర్మ నటించిన జానే జాన్‌లో కనిపించారు. ఇదిలా ఉంటే 47ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన రణ్‌దీప్ తన వివాహ వేడుకను డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడట.

ప్రస్తుతం సెలబ్రెటీలు డిస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటే రణ్‌దీప్, లిన్ పౌరాణికం స్టైల్లో ప్లాన్ చేశారట. మహాభారతం పౌరాణిక నేపథ్యంతో వివాహాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. లిన్ మణిపూర్‌కు చెందిన నటి కాగా.. తనకు కాబోయే భార్య సొంత ఊర్లోనే ఈ వేడుక జరగనుంది. మణిపూర్ సంప్రదాయంలో వీరి వివాహ వేడుక జరుగునుందని సమాచారం. పెళ్లి అనంరతం ముంబై గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుందట.