Leading News Portal in Telugu

Gangula Kamalakar: బండి సంజయ్‌కు తొడకొట్టి సవాల్‌ విసిరిన మంత్రి గంగుల



Gangula

Gangula Kamalakar: కరీంనగర్ నగర అభివృద్ధి కొరకు స్మార్ట్ సిటీ నిధులపై చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్‌కి తొడ కొట్టి సవాల్ విసిరారు మంత్రి గంగుల కమలాకర్‌. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ టవర్ సర్కిల్‌లో ప్రజలను ఉద్దేశించి గంగుల కమలాకర్‌ మాట్లాడారు. ఇప్పుడు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దోపిడీ దొంగ రేపు మీ వ్యాపార సంస్థలను వేధించి మామూలు వసూలు చేస్తాడని ఆరోపించారు. బండి సంజయ్ నోరు విప్పితే అబద్ధాలు కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ ప్రకటన వినోద్ కుమార్ వల్లే వచ్చింది అది ప్రకటించే సమయానికి బండి సంజయ్ ఎంపీ కాదన్నారు. బండి సంజయ్ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Also Read: AK Goyal: మాజీ ఐఏఎస్‌ ఏకే గోయల్‌ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు

ఎంపీగా పోటీ చేసినప్పుడు గుండె నొప్పి అంటూ అబద్ధాలాడి హాస్పటల్లో అడ్మిట్ అయి ప్రజలను మోసం చేసి గెలిచాడన్నారు. మళ్లీ ఇప్పుడు మోడీ సభ రోజున ఏదో యాక్షన్ చేసి హాస్పటల్లో పడి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొ్న్నారు. మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమకు టికెట్ రాకుండా చేసి వేములవాడ టిక్కెట్‌ని డబ్బులకు బండి సంజయ్ అమ్ముకున్నారని ఆరోపించారు. కరీంనగర్ నగరంలో శాంతి భద్రతాలు అదుపులో ఉన్నాయని, ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రతుకుతున్నారని.. ఇది గమనించి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.