
Telangana IT Raids: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడింది. అయితే ఐటీ దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఐటీ దాడులు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ఇటీవల రాజకీయ నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేత పారిజాత నరసింహారెడ్డితో దాడులు మొదలయ్యాయి, ఆ తర్వాత కేఎల్‌ఆర్, మంత్రి సబిత అనుచరులు, జానా రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి, రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు గడ్డం వినోద్, వివేక్‌ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా పాతబస్తీకి చెందిన బడా వ్యాపారులపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు వివిధ బృందాలుగా ఏర్పడి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
Read also: Rajasthan Election: రాజస్థాన్ లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..
ఓ రాజకీయ పార్టీకి భారీగా ముడుపులు అందినట్లు సమాచారం అందడంతో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగుతాయని సమాచారం. పాతబస్తీతో పాటు హైదరాబాద్ శాస్త్రిపురంలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కోహినూర్ గ్రూప్ ఎండీ మాజిద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వ్యాపారవేత్త షానవాజ్‌తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కోహినూర్ కింగ్స్ గ్రూప్ పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు నడుపుతున్న వ్యాపారుల ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి. రాజభవన యజమానుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఐటీ శాఖ అధికారులతో పాటు సీఐఎస్ఎఫ్ కూడా ఉన్నారు. పాతబస్తీకి చెందిన బడా వ్యాపారులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు