Leading News Portal in Telugu

Barrelakka Special Interview: నన్ను లేపెయ్యాలని చూస్తున్నారు!.. బర్రెలక్కతో స్పెషల్‌ ఇంటర్వ్యూ


Barrelakka Special Interview: నన్ను లేపెయ్యాలని చూస్తున్నారు!.. బర్రెలక్కతో స్పెషల్‌ ఇంటర్వ్యూ

Barrelakka Special Interview: హాయ్‌ ఫ్రెండ్స్‌.. బర్రెలు కాయడానికి వచ్చానండి.. ఒక్కో బర్రె 2 నుంచి 3 లీటర్లు ఇస్తాయి ఫ్రెండ్స్‌.. పెద్ద చదవులు చదివినా ఉద్యోగం రాక బర్ల కాడికి వచ్చిన అంటూ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అయింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. సరదాగా చేసిందో.. లేక తన అసహనాన్ని తెలిపేందుకు చేసిందో కానీ.. ఓ రీల్ తన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలించింది బర్రెలక్క. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి బర్రెలక్క పోటీ చేస్తుండగా.. తనకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. సామాన్యునికి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాల గురించి సగటు నిరుద్యోగి బాధలు గురించి మాట్లాడుతూ అందరినీ ఆలోచింపజేస్తున్నారు బర్రెలక్క. ఎన్ని బెదిరింపులు వచ్చినా మొక్కవోని ధైర్యంతో తాను భారీ మెజార్టీ విజయం సాధిస్తానంటున్న బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషతో ఎన్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.