Leading News Portal in Telugu

Stampede: కొచ్చి యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి..



Kerala

Stampede: కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్ అండ్ టెక్నాలజీ(CUSAT)లో శనివారం జరిగిన మ్యూజిక్ ఫెస్ట్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు. 64 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ పాల్గొన్న ఈ కార్యక్రమం యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవలు స్పందించి, క్షతగాత్రులను చికిత్స కోసం కలమసేరి మెడికల్ కాలేజీ, కిండర్ ఆస్పత్రులకు తరలించారు. బాధితులకు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు.

Read Also: Elon Musk: జనవరిలో ఇండియాకు ఎలాన్ మస్క్..?

ప్రాథమిక నివేదిక ప్రకారం.. సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో వెనక నిలబడిన విద్యార్థులు, వర్షం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా నీడ కోసం ముందుకు వచ్చారు. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా విద్యార్థులు ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.

టెక్ ఫెస్ట్‌లో భాగంగా సంగీత కార్యక్రమం నిర్వహించబడిందని, జనాలు విపరీతంగా ఉండటం, అదే సమయంలో వర్షం రావడంతో సమస్య ఏర్పడిందని, విద్యార్థులు సడెన్‌గా ముందుకు రావడంతో కింద పడ్డారని, మొత్తం ఈ కార్యక్రమానికి 2000 మంది విద్యార్థులు హాజరైనట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ శంకరన్ తెలిపారు.