Leading News Portal in Telugu

Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కోసం భార్యను చంపేసిన భర్త..


Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కోసం భార్యను చంపేసిన భర్త..

Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఫ్రైడ్ చికెన్ కొనడానికి నగదు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓ టైలర్ తన భార్యను కత్తెరతో గొంతుకోసి హత్య చేశాడు. ఘజియాబాద్ లోని ప్రేమ్ నగర్ కాలనీలో శనివారం ఈ హత్య జరిగింది. షాహిద్ హుస్సేనే అతని భార్య నూర్ బానో(46)ని హత్య చేశాడని ఏసీపీ సిద్ధార్థ గౌతమ్ తెలిపారు. దంపతుల పిల్లల ముందే ఈ హత్య జరిగింది. భార్యను హత్య చేసిన కొన్ని గంటల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులమని బెదిరించి మహిళపై అత్యాచారం:

మధ్యప్రదేశ్ అశోక్‌నగర్‌లో దారుణం జరిగింది రైల్వే స్టేషన్‌లో భర్తతో వేచి చూస్తున్న మహిళపై ఇద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులమని బెదిరించి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి రాజస్థాన్ జైపూర్ వెళ్లాల్సిన ట్రైస్ మిస్ కావడంతో 30 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి ముంగవోలి రైల్వే స్టేషల్‌లో ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

భర్తకు మద్యం తాగే అలవాటు ఉండటంతో అతను మద్యం కోసం స్టేషన్ బయటకు వెళ్లిన సమయంలో ట్రైన్ మిస్సైందని రైల్వే పోలీస్ అధికారి జెఎల్ అహిర్వార్ తెలిపారు. సివిల్ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు జంట వద్దకు వచ్చి టికెట్లు, ఇతర వివరాలను అడిగారు, గుర్తింపు కార్డులు చూపమని బెదిరిస్తూ మహిళ భర్తను కొట్టారు. నిందితుల్లో ఒకరు మహిళ భర్తను తీసుకెళ్లగా.. మరో వ్యక్తి సమీపంలోని పొదల్లోకి మహిళను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరో వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. గుర్తు తెలియని నిందితులపై గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేశారు. వారి కొసం పోలీసులు గాలింపు చేపట్టారు.