
Ambati Rambabu: పవన్ కళ్యాణ్ విశాఖలో 50వేల చెక్కు ఇచ్చి జగన్‌ను దూషించడం మొదలుపెట్టారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ గడ్డం పెరిగినా, ఫ్లైట్ లేట్ అయినా సీఎం జగన్ కారణం అంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి, పవన్ బీజేపీకి… ఏంటయ్యా… మీ నీచ రాజకీయాలు అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మనోహర్ ఇచ్చిన స్లిప్పులో భాష పవన్ మాట్లాడతాడని ఆయన ఎద్దేవా చేశారు. పవన్‌కు ఈ రాష్ట్రానికి ఏంటయ్యా సంబంధం.. నీకు సొంత ఊరు, ఇల్లు, ఓటు ఇక్కడ లేవన్నారు. పవన్ నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో కూడా తెలీదన్నారు. పవన్ సామాజిక వర్గాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టి చంద్రబాబును గెలిపించాలని తయారయ్యావని ఆయన అన్నారు. చంద్రబాబుకు నీ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టావు అంటూ విమర్శలు గుప్పించారు. \
బానిసగా ఉంటూ చెగువీరా అని ఎలా అంటావు… బానిసగా ఉంటూ చంద్రబాబు, లోకేష్ పల్లకీ మోస్తున్నావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. ఒకరి పల్లకీలు మోసే వ్యక్తులను ఆ సామాజికవర్గం నాయకుడిగా గుర్తించదన్నారు. మోసపోవడానికి ఆ సామాజికవర్గం సిద్ధంగా లేదన్నారు. ఇన్‌కం ట్యాక్స్‌లో ఆయన సొమ్ము ఏంటో పవన్ నిరూపించాలన్నారు. రాజశేఖరరెడ్డి గురించి మాట్లాడే అర్హత పిల్ల పవన్‌కు ఉందా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆగిపోయిన హాస్య కథా చిత్రం రేపటి నుంచీ మరల మొదలవుతుందన్నారు. అసలు పుత్రుడు చేసే కామెడీ రేపటి నుంచీ మీరు చూడచ్చన్నారు. తెలంగాణా రాజకీయాల ప్రభావం ఏపీపై ఉండదన్నారు. అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా మాతో సత్సంబంధాలే ఉంటాయన్నారు. వారాహికి తెలంగాణలో లైసెన్స్ లేదనుకుంటా… చంద్రబాబు చెపితే చేసిన వారాహి కనుక ఆయన డైరెక్షన్‌లోనే వెళుతుందన్నారు.