
ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా రెండో టీ20లో ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్ పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యా్న్ని ఆస్ట్రేలియా ముందు పెట్టింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్లు స్టీవ్ స్మిత్ (19), మాథ్యూ షార్ట్ (19) పరుగులు చేశారు. ఆ తర్వాత తొలి టీ20 సెంచరీ వీరుడు.. ఈ మ్యాచ్ లో కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ తోనే ఎంట్రీ ఇచ్చిన మ్యాక్స్ వెల్ (12)కూడా అనుకున్నంతగా రాణించలేదు. మార్కస్ స్టోయినీస్ (45) పరుగులు చేసి జట్టుకు కొంత స్కోరును అందించాడు. ఆ తర్వత టిమ్ డేవిడ్ (37) పరుగులు చేశాడు. మాథ్యూ వేడ్ (42), సేన్ అబాట్ (1) నేథన్ ఇల్లీస్ (1) ఆడం జంపా (1), తన్వీర్ సంఘా (2) పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, అర్షదీప్ సింగ్ కు తలో వికెట్ దక్కింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు జైస్వాల్ (53) రుతురాజ్ (58) అర్ధసెంచరీలు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇషాన్ కిషన్ (52) కూడా హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యదవ్ 19 పరుగులు చేశాడు. చివరలో రింకూ సింగ్ కేవలం 9 బంతుల్లో 31 పరుగుల చేసి స్కోరును పెంచాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లీస్ 3 వికెట్లు పడగొట్టాడు. మార్కస్ స్టోయినీస్ కు ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో టీమిండియా 2-0తో ఆధిక్యంతో ఉంది.