Leading News Portal in Telugu

Malaysia Visa-Free Entry: భారతీయులకు బంపర్ ఆఫర్.. వీసా లేకుండా మలేషియా టూర్


Malaysia Visa-Free Entry: భారతీయులకు బంపర్ ఆఫర్.. వీసా లేకుండా మలేషియా టూర్

భారతీయులకు మలేషియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారతీయులు ఇప్పటికే థాయ్‌లాండ్, శ్రీలంకలో వీసా ఫ్రీ ఎంట్రీని పొందుతున్నారు. ఇక నుంచి మలేషియాలో వెళ్లేందుకు వీసా అవసరం లేదని ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటన చేశారు. గతంలో కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ, టర్కీ, జోర్డాన్, ఇరాన్ దేశాలకు మలేషియా ఈ మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు భారతదేశానికి ఈ అవకాశం దక్కింది. అయితే, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం నిన్న (ఆదివారం) అర్థరాత్రి తన పీపుల్స్ జస్టిస్ పార్టీ కాంగ్రెస్‌లో చేసిన ప్రసంగంలో ఈ ప్రకటన చేశారు. డిసెంబర్ 1 నుండి 30 రోజుల పాటు చైనా, భారతదేశ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని ఇస్తుందన్నారు. అయితే, వీసా మినహాయింపు ఎంతకాలం వర్తిస్తుందో ఆయన వెల్లడించలేదు.

ఇక, మలేషియాకు వెళ్లే అత్యధిక పర్యాటకులలో చైనా ప్రజలు నాల్గవ స్థానంలో భారతీయులు ఐదవ స్థానంలో ఉన్నారు. మలేషియాకు ఈ రెండు దేశాలు పెద్ద మార్కెట్లు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య మలేషియాకు 9.16 మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారు.. ఇందులో చైనా నుండి 4 లక్షల 98 వేల 540 మంది పర్యాటకులు ఉండగా.. భారతదేశం నుండి 2 లక్షల 83 వేల 885 మంది పర్యాటకులు ఉన్నారు. కరోనాకు ముందు 2019 ఇదే కాలంలో చైనా నుండి 15 లక్షల మంది.. భారతదేశం నుండి 3 లక్షల 54 వేల 486 మంది మలేషియాకు వెళ్లారు.

దీంతో పర్యటకులను ఆకర్షించేందుకు మలేషియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మినహాయింపు పొందిన వారిలో చైనా, భారతీయ పౌరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం, చైనా- భారతీయ పౌరులు మలేషియాలోకి ప్రవేశించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.