
Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. ఇక ప్రచారానికి ఇంకా 48 గంటలు మాత్రమే సమయం ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలు మరింత దూకుడు పెంచుతాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు బహిరంగ సభలు, రోడ్ షోలు, వీధి సభల ద్వారా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ప్రచార పర్వం ముగియనుండటంతో నేతల మాటలు తూటాలుగా పేలనున్నాయి.
అధికారం తమదేనని అన్ని పార్టీలు పట్టుబడుతున్నాయి. ఓటర్లను ఎలాగైనా తమ వైపుకు మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున భారీ సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ 48 గంటల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. బీజేపీ తరపున మోడీ, అమిత్ షా, నడ్డా, యోగి, పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డి, బండిసంజయ్, ఈటల జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
Read also: RythuBandhu: తెలంగాణ సర్కార్‌కు ఈసీ షాక్.. రైతు బంధు అనుమతి ఉపసంహరణ
బీఆర్ఎస్..
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాలు, జిల్లాల వారీగా పర్యటనలు, విపక్షాలకు దీటుగా సమాధానమిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ ఈరోజు మరో నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. షాద్ నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డిలో జరిగే జన్ ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. హుజూరాబాద్, ఏటూరునాగారం, అంబర్‌పేట, ముషీరాబాద్‌లో కేటీఆర్ ప్రచారంతో పాటు సుల్తానాబాద్, వెలగత్తూరు, చెన్నూరు, హైదరాబాద్‌లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో హరీశ్‌రావు ప్రచారం నిర్వహించనున్నారు.
బీజేపీ..
ఇవాళ మహబూబాబాద్, కరీంనగర్‌లో జరిగే సభల్లో మోదీ పాల్గొననున్నారు. దీని తర్వాత హైదరాబాద్‌లో రోడ్ షో చేస్తాం. ఈరోజు హుజూరాబాద్, పెద్దపల్లి, మంచిర్యాలలో అమిత్ షా ప్రచారం నిర్వహించనున్నారు. జగిత్యాల, బోధన్, బాన్సువాడ, జుక్కల్‌లో జేపీ నడ్డా ప్రచారం నిర్వహించనున్నారు. అసోం సీఎం బిశ్వాస్ శర్మ దేవరకద్ర, మంథని, పరకాలలో ప్రచారం చేయనున్నారు. పీయూష్ గోయల్ హనుమకొండలో ప్రచారం నిర్వహించి మేధావులతో సమావేశం కానున్నారు.
కాంగ్రెస్..
ప్రియాంక ఈరోజు భువనగిరి, గద్వాల, కొడంగల్‌లలో ప్రచారం చేయనున్నారు. ఈరోజు ఎలందు, డోర్నకల్, కొడంగల్‌లో జరిగే సభల్లో రేవంత్ పాల్గొననున్నారు. ఖర్గే నర్సాపూర్‌లో ప్రచారం నిర్వహించి సాయంత్రం 4:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు.
BJP Meetings: బీజేపీ అగ్రనేతల జోరు ప్రచారం.. నేడు ఎవరు ఎక్కడంటే?