Leading News Portal in Telugu

Kantara Chapter 1: అప్పుడు శాంపిల్ చూపించి వదిలేసాడు… ఈసారి సాక్షాత్ శివుడిని దించేలా ఉన్నాడు


Kantara Chapter 1: అప్పుడు శాంపిల్ చూపించి వదిలేసాడు… ఈసారి సాక్షాత్ శివుడిని దించేలా ఉన్నాడు

కాంతర సినిమా 2022లో క్రియేట్ చేసిన సెన్సేషన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా వరకు చేరింది. రీజనల్ సినిమాగా వచ్చిన కాంతారని అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్ ఎక్స్ట్రాడినరీగా రిసీవ్ చేసుకున్నారు. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతర మూవీకి సీక్వెల్ వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి రిషబ్ శెట్టి అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తాడా అని వెయిట్ చేస్తున్న కాంతార మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ బయటకి వచ్చేసింది. కాంతార క్లైమాక్స్ లో వరాహ అవతారంలో జస్ట్ శాంపిల్ చూపించిన రిషబ్ శెట్టి… ఈసారి కాంతార పార్ట్ 1తో సాక్షాత్ పరమ శివుడినే చూపించబోతున్నట్లు ఉన్నాడు. హోంబలే నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ చూస్తే ఇదే అనిపిస్తుంది ఎవరికైనా. కాంతారలో చూసిన కథ కన్నా ముందు ఏం జరిగింది? అసలు వరాహ అవతారం కథ ఎక్కడి నుంచి మొదలయ్యింది అనేది కాంతర పార్ట్ 1లో చూపించబోతున్నాడు రిషబ్ శెట్టి.

కాంతరలో కొన్ని సీన్స్ తో మొదలైన టీజర్… దారి చూపించేది వెలుగు కాదు దర్శనం అంటూ మొదలయ్యింది. ఆ తర్వాత వరాహ అవతారంలో త్రిశూలం పట్టుకోని, గండ్ర గొడ్డలి పట్టుకోని కనిపించిన రిషబ్ శెట్టి గూస్ బంప్స్ తెప్పించాడు. రిప్డ్ బాడీతో, లాంగ్ హెయిర్ తో పరమ శివుడిని గుర్తు చేసేలా ఉన్న రిషబ్ శెట్టి కాంతర పార్ట్ 1కి ఇన్స్టాంట్ హైప్ తెచ్చాడు. టీజర్ లో ఇంకో మెయిన్ హైలైట్ అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. కాంతర సినిమాకి ప్రాణం పోసిన అజనీష్ మరోసారి తన మ్యాజిక్ ని చూపించాడు. “ఓ” అనే అరుపు టీజర్ లో ప్లే అవ్వడమే ఆలస్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఏడు భాషలకి కలిపి ఒకటే టీజర్ ని రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి కాంతర రేంజ్ ని అమాంతం పెంచేసాడు. ఇంతక ముందు కన్నడలో రిలీజ్ అయ్యి పాన్ ఇండియాకి స్ప్రెడ్ అయిన కాంతర ఈసారి రిలీజ్ అవ్వడమే పాన్ ఇండియా టార్గెట్ గా రిలీజ్ అవుతోంది. మరి రిషబ్ ఈసారి ఎలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడో చూడాలి.