
విదేశాల్లో ఉన్న ఖలిస్తానీలు భారత రాయబారితో మరోసారి దురుసుగా ప్రవర్తించారు. ఈసారి ఖలిస్తాన్ మద్దతుదారులు రాయబారి తరంజిత్ సింగ్ సంధూను గురుద్వారా లోపలికి తోసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అంతే కాదు ఆయన చుట్టూ ఉన్న జనం నినాదాలు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంధు కుట్ర పన్నాడని అందరూ ఆరోపిస్తున్నారు.
ఇక, భారత రాయబారి చుట్టూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తుస్సీ హర్దీప్ సింగ్ నిజ్జర్ దే కాటిల్ హో అంటూ అక్కడ ఉన్న వాళ్లు నినాదాలు చేస్తున్నారు. తరంజిత్ సింగ్ సంధూను బయటకు తీసుకెళ్లడానికి కొందరు ప్రయత్నించారు. ఖలిస్తాన్ రెఫరెండం ప్రచారంలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు పాత్రపై నిరాధారమైన ప్రశ్నలు అడగడటంతో పాటు ఖలిస్తాన్‌లు అతనిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. ఈ అల్లరి మూకను ఎస్.ఎఫ్.జే (SFJ) పంపినట్లు బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ఆరోపించారు.
ఇక, బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా ఇలా రాసుకొచ్చాడు.. ‘న్యూయార్క్‌లోని హిక్స్‌విల్లే గురుద్వారాలో ఖలిస్తానీలకు నాయకత్వం వహిస్తున్న హిమ్మత్ సింగ్, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ పాత్ర ఉందని వారు ఆరోపించారు. హిమ్మత్ సింగ్ సరి గురుద్వారా అధ్యక్షుడు.. ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ కెనడా చాప్టర్‌కు సమన్వయకర్త.. ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికాలో కూడా యాక్టివ్ అవుతున్నారని ఆర్పీ సింగ్ పేర్కొన్నారు.
ఇటీవల అమెరికాలో పన్నూని చంపడానికి అమెరికన్ అధికారులు కుట్రను భగ్నం చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అమెరికా నుంచి అందిన సమాచారంపై దర్యాప్తు జరుపుతున్నామని భారత్ ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా నిజ్జర్ మరణానికి సంబంధించి భారతదేశంపై అనేక ఆరోపణలు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.
Khalistanies tried to heckle Indian Ambassador @SandhuTaranjitS with basless Questions for his role in the failed plot to assassinate Gurpatwant, (SFJ) and Khalistan Referendum campaign.
Himmat Singh who led the pro Khalistanies at Hicksville Gurdwara in New York also accused… pic.twitter.com/JW5nqMQSxO
— RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) November 27, 2023