Leading News Portal in Telugu

Oneplus 12 Release Date: రిలీజ్‌కు ముందే.. వన్‌ప్లస్‌ 12 అఫీషియల్‌ ఫొటోస్ లీక్‌!


Oneplus 12 Release Date: రిలీజ్‌కు ముందే.. వన్‌ప్లస్‌ 12 అఫీషియల్‌ ఫొటోస్ లీక్‌!

Oneplus 12 Release Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ వన్‌ప్లస్‌ నుంచి త్వరలో ‘వన్‌ప్లస్‌ 12’ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ రానుంది. వనప్లస్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్‌ 4న చైనాలో ఈ ఫోన్ విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే వన్‌ప్లస్‌ 12 ఫోన్‌కు సంబంధించిన అఫీషియల్‌ ఫొటోస్ ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్ల లీక్‌తో పాటు టీజ‌ర్లు కూడా నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జనవరిలో ఈ ఫోన్‌ లాంచ్‌ చేసే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ 12 ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. పెరీస్కోప్‌ జూమ్‌ లెన్స్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 12లో 64 మెగా పిక్సల్‌ పెరీస్కోప్‌ టెలీఫొటో లెన్స్‌ ఇస్తున్నట్లు గతంలో వన్‌ప్లస్‌ చైనా ప్రెసిడెంట్‌ లీజీ తెలిపారు. దీనికి అదనంగా 50 ఎంపీ సోనీ ఓఐఎస్‌ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌ కూడా ఉండనున్నాయి. సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా ఇవ్వనున్నారని సమాచారం. హైక్వాలిటీ ఫొటోలను తీయడంలో ఈ కెమెరాలు సాయపడనున్నాయి.

వన్‌ప్లస్‌ 12 ఫోన్‌లో లేటెస్ట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. 2600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్‌ వస్తున్నట్లు సమాచారం. 144 Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌తో 6.82 ఇంచెస్ ఓల్‌ఈడీ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే ఇందులో అమర్చారని సమాచారం. కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో వ‌న్‌ప్ల‌స్ 12 మోడ్ర‌న్ లుక్‌తో కనిపించనుంది. ఇక 16GB + 256GB వేరియెంట్ ధర దాదాపుగా 80 వేలు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ పేల్‌ గ్రీన్‌, రాక్‌ బ్లాక్‌, వైట్‌ కలర్స్‌లో రానుంది.