Leading News Portal in Telugu

Yashasvi Jaiswal: నా తప్పే.. సారీ చెప్పా: యశస్వి జైస్వాల్‌


Yashasvi Jaiswal: నా తప్పే.. సారీ చెప్పా: యశస్వి జైస్వాల్‌

I Accepted my mistake Said Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌.. తన పార్ట్‌నర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు సారీ చెప్పాడట. ఈ విషయాన్ని రెండో టీ20 మ్యాచ్‌ అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సందర్భంగా మాట్లాడుతూ వెల్లడించాడు. ‘మొదటి టీ20 మ్యాచ్‌లో రనౌట్‌ నా తప్పే. అందుకు నేను రుతురాజ్‌కు సారీ చెప్పా. నా తప్పును అతడి ముందు అంగీకరించా. రుతురాజ్‌ చాలా మంచి వ్యక్తి. ఎంతో జాగ్రత్తగా ఉంటాడు’ అని జైస్వాల్‌ తెలిపాడు. మొదటి టీ20 మ్యాచ్‌లో రుతురాజ్‌ డిమాండ్ డకౌట్ అయిన విషయం తెలిసిందే.

రెండో టీ20 మ్యాచ్ గురించి యశస్వి జైస్వాల్‌ మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్ నాకు ప్రత్యేకమైనది. నా షాట్లన్నీ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. నిర్భయంగా షాట్లు కొట్టా. షాట్ల ఎంపిక విషయంలో కూడా స్పష్టంగా ఉన్నా. మైదానంలో స్వేచ్ఛగా ఆడు అని మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్య , కోచ్‌ లక్ష్మణ్‌ చెప్పారు. దీంతో నా ఆటలు మైదానంలో చూపించాలనుకున్నా. నేను ఆటను మెరుగుపర్చుకోవాలనుకుంటా. అంతకుమించి మరేదీ ఆలోచించను. నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నా. మానసిక అంశాలపై దృష్టి పెట్టా. నా ప్రాక్టీస్ సెషన్లపై నాకు నమ్మకం ఉంది’ అని అన్నాడు.

తిరువనంతపురం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో యువ భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (58; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. ఆపై ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడిపోయింది. భారత బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ, రవిబిష్ణోయ్‌ చెరో 3 వికెట్లు తీశారు.