
20 years Sentence to Subhiksha Subramaniyan: ప్రముఖ వ్యాపారవేత్త, ఐఐటీ ఇంజనీర్ గోల్డ్ మెడలిస్ట్ ఆర్ సుబ్రమణియన్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పథకాల పేరుతో వందలాంది మంది పెట్టుబడి దారులను మోసగించి వారి పెట్టుబడులను దారి మళ్లీంచిన కేసులో నేరారోపణలు రుజువైనందున్న చెన్నై స్పెషల్ కోర్టు నవంబర్ 20న అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అదే విధంగా సుబ్రమణియన్‌తో పాటు అతడి సహాచరులకు కోర్టు రూ. 190 కోట్ల జరిమానా విధించింది. ‘సుభిక్ష సుబ్రమణియన్’ వ్యవస్థాపకుడైన సుబ్రమణియన్ ఐఐటీ మద్రాస్ ఇంజనీరింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో చదివిన అతడు వ్యాపార రంగంలో సంచలనంగా మారాడు.
సుభిక్ష సుబ్రమణియన్ పేరుతో సొంతంగా రిటైల్ బిజినెస్ స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు. కొన్నెళ్లలోనే సుభిక్ష దేశంలోనే అతిపెద్ద చైన్ బిజినెస్‌గా మారింది. అయితే అదే సమయంలో సుబ్రమణియన్ కొన్ని పథకాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నకిలీ పత్రాలు సృష్టించి ఇన్వెస్టర్స్‌ని ఆకర్షించాడు. అవి మెచ్చ్యురిటీ అయిన తర్వాత వాటిని మళ్లీంచి.. కొత్త పథకాల్లో పెట్టుబడి పెట్టేలా చేశారు. స్వల్పకాలిక పెట్టుబడులపై అధిక లాభాలతో పెట్టుబడిదారులను ఆకర్షించారు. ఈ విధంగా వందలాది మంది పెట్టుబడిదారులను మోసం చేసి వారి సొమ్మును వివిధ షెల్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాడు. అలా పెట్టుబాడిదారులను మోసం చేసి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. సుబ్రమణియన్ అతని సహచరులు విశ్వప్రియ ఇండియా లిమిటెడ్ పేరుతో నాలుగు పథకాలను ప్రారంభించారు.
ప్రైమ్ ఇన్వెస్ట్, అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీ బాండ్, లిక్విడ్ ప్లస్ అండ్ సేఫ్టీ ప్లస్ పేర్లతో పథకాలు పెట్టి వాటి ద్వారా డబ్బు మళ్లీంచాడు. ఇందులో పెట్టుబడుదారులతో డబ్బులు పెట్టించి అవి మెచ్చ్యూరిటీ కాగానే మరిన్ని ప్రయోజనాలంటూ మభ్యపెట్టి డబ్బులు వెనక్కి తీసుకుని ఇతర షెల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన ఇన్వెస్టర్లు అతడిపై కేసు నమోదు చేశారు. కొంతకాలంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు సుబ్రమణియన్ పటిషన్‌ను చెన్నై స్పెషల్ కోర్టు నవంబర్ 20న విచారించగా అతడిపై నేరారోపణలు రుజువయ్యాయి. దీంతో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే సుబ్రమణియన్‌తో పాటు అతడి సహచరులకు రూ. 190 కోట్ల జరిమాన విధించగా అందులో 180 కోట్ల బాధిత పెట్టుబడిదారులకు పంచాల్సిందిగా కోర్టు ఆదేశించింది.