Leading News Portal in Telugu

Karnataka: లక్ష అప్పు.. ముగ్గురు పిల్లలతో సహా భార్యభర్తల ఆత్మహత్య.. రెండు పేజీల సూసైడ్ నోట్


Karnataka: లక్ష అప్పు.. ముగ్గురు పిల్లలతో సహా భార్యభర్తల ఆత్మహత్య.. రెండు పేజీల సూసైడ్ నోట్

Karnataka Family Suicide: కర్ణాణకలో దారుణం చోటు చేసుకుంది. రూ. 1.5 లక్షల అప్పు ఓ కుటుంబాన్ని బలిగొంది. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేక.. అప్పులవారి వేధింపుల భరించలేక ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తుమకూరు జిల్లా సదాశివ నగర్‌లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు మఈతుడు రెండు పేజీల సూసైడ్ నోట్, బంధువులకు ఓ సెల్పీ వీడియో పంపినట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా ధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాలు.. గరీబ్ సాబ్ (36) అనే వ్యక్తి తన భార్య సుమయ్య (33), వారి కుమార్తె హజీరా (14), కుమారులు మహ్మద్ సుభాన్ (10), మహ్మద్ మునీర్‌లతో (8) కలిసి తుమకూరు జిల్లా సదాశివనగర్‌లోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్నాడు. కబాబ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. అదే అపార్టుమెంట్‌లో గ్రౌండ్ ఫ్లోర‌లో నివసించే కలందర్ వద్ద రూ. 1.5 లక్ష అధిక వడ్డికి అప్పు తీసుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల గరిబ్ వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు.

అప్పు తీర్చమంటూ, వడ్డీ కట్టాలంటూ తరచూ కలందర్ తన కుటుంబాన్ని వేధించేవాడని గరిబ్ సూసైడ్ నోట్‌లో తెలిపాడు. తన భార్యతో అసభ్యంగా మాట్లాడుతూ తన పిల్లలని కొట్టేవాడని పేర్కొన్నాడు. అంతేకాదు ఇరుకుపొరుగు వారు కూడా తమని నీచంగా చూసేవారని, అది భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు తమని మానసికంగా వేధించిన కలందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గరిబ్ తన వీడియోలో పోలీసులను కోరాడు. అలాగే తన నానమ్మకు పంపిన వీడియోలో కష్టకాలంలో తమకు డబ్బులు ఇచ్చి ఆదుకున్న బంధువులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు.

తన ఇంటి సమాన్లు, ఇతర వస్తువులు అమ్మి తన అప్పులు తీర్చాల్సిందిగా గరిబ్ తన నానమ్మకు తెలిపాడు. ఈ ఘటనపై ఎస్పీ అశోక్ వెంకట్ మాట్లాడుతూ.. అప్పుల బాధ వల్లే గరిబ్ తన కుటుంబంతో ఆత్మహత్య పాల్పడ్డాడని వెల్లడించారు. మొదటి గరిబ్ తన ముగ్గురు పిల్లల గొంతునులిమి చంపాడని, ఆ తర్వాత భార్యతో పాటు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. సూసైడ్ నోట్, సెల్పీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.