
CPI Narayana: బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు నిద్రపోయారా..? ఎన్నికలు అయ్యాక కవితను అరెస్ట్ చేస్తారా! అంటూ సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనాటి పెళ్ళికొడుకుగా తుమ్మలను సాంబోదించారు. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మాకు ఒక్కసేట్టు మాత్రమే ఇచ్చారని కాంగ్రెస్ వాళ్లు పిసినారులు అంటూ మండిపడ్డారు. బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీం గా అడుగులకుమాడుగులు ఒత్తుతుందని తెలిపారు. ఆడవాళ్లకు లిక్కర్ వ్యాపారం ఏంటి? బిడ్డను కాపాడాలి అంటే మోడీ కాళ్ళు మొక్కలు అని కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక్ మొన్నటి వరకు బీజేపీ ఉన్నాడు….ఇన్నాళ్లు అవినీతిపరుడు కాదు పార్టీ మారిన 10 రోజుల్లో వేల కోట్లు ఎలా సంపాదించాడు అంటూ మండిపడ్డారు.
అజయ్ కంటే తుమ్మలనే అందగాడు అంటూ వ్యంగాస్త్రం వేశారు. అలాంటిది కేసీఆర్ తుమ్మలను తుమ్మ కంప అంటాడా? అని ప్రశ్నించారు. తులసి మొక్కకు అందరూ పూజిస్తారు.. మరి గంజాయి మొక్కను ఎవరన్నా పూజిస్తారా? అని మండిపడ్డారు. పువ్వాడ ఇంట్లో మొలచిన గంజాయి మొక్క పువ్వాడ అజయ్ అని తెలిపారు. అనవసరంగా పువ్వాడ కుటుంబంలో పుట్టాడని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో గంజాయికి ఓటు వేసేది లేదని స్పష్టం చేశారు. తుమ్మల తిట్లు ప్రేమతో తిట్టేవన్నారు. మా మద్దతు పూర్తిగా తులసి మొక్కకే అన్నారు. నేను చాలా మందిని విమర్శించాను కానీ తుమ్మలను విమర్శించే అవకాశం ఆయన ఇవ్వలేదన్నారు. ఒక్క ఓటుతో మూడు పిట్టలు రాలాలి అని అన్నారు. కాంగ్రెస్ వస్తే తెలంగణ సొమ్ము ఆగం చేస్తారు అని అన్నాడు.. అది నిజమే వాళ్ళు ఆగం చేసే ఆస్తి తెలంగాణ ది కాదు కల్వకుంట్ల వాళ్ళు అక్రమంగా సంపాదించిన సొమ్మును అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: MLC Kavitha: బాండ్ పేపర్ పేరుతో కొత్త డ్రామా.. కాంగ్రెస్ పై కవిత విమర్శ
రైతు బంధు నాలుగు రోజుల్లో వేస్తే ఇబ్బందేంటి? దాన్ని కూడా ఎన్నికలకు వాడాలని చూసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఉద్యోగం రాలేదు.. 10 కి 10 సీట్లు కాంగ్రెస్ మిత్ర పార్టీలదే అన్నారు. ఒడిపోయేది అజయ్ మాత్రమే.. అహంలో నెంబర్ వన్ కేసీఆర్, నెంబర్ 2 కేటీఆర్, నెంబర్ 3 గంజాయి మొక్క అజయ్ అంటూ నిప్పులు చెరిగారు. నిరాహార దీక్షలో కూడా కేసీఆర్ మోసం ఉందని తెలిపారు. చనిపోకుండా ఉండే మందులు మ్రింగాడు కేసీఆర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను బ్రతికించిన డాక్టర్ గోపినాధ్ మీద అక్రమ ఆయుధాల కొనుగోలు కేసు కరీంనగర్ లో పెట్టారని అన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కి దుర్మార్గుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. 15 ఎకరాల నుంచి 2 వేల ఎకరాలు సంపాదించాడని అన్నారు.
ఇక కేసీఆర్ ఫార్మ్ హౌస్ కే పరిమితం అన్నారు. 10 ఏళ్ళు నిద్రపోయారా బీజేపీ వాళ్ళు.. ఎన్నికలు అయ్యాక అరెస్ట్ చేస్తారాట కవితను అన్నారు. డిసెంబర్ 9 న ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి తో నన్ను దీక్ష విరమణ చేపించండి అన్నాడు కేసీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజు ఆగు అంటే ఆగినందుకు సోనియా ఆ రాత్రే ప్రకటించిందని తెలిపారు. చావునోట్లో తల పెట్టింది కేసీఆర్ కాదు హరీష్ కాదు విద్యార్థి అమరులు అన్నారు. ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోయింది చూశాం కానీ పిల్లర్లు కుంగింది చూడలేదని తెలిపారు. కాళేశ్వరం లాగే బీఆర్ఎస్ పార్టీ అంతరించి పోతుందని అన్నారు.
Rahul Gandhi: ఈఎస్ఐ, పీఎఫ్ అందించండి.. రాహుల్ తో.. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్