
ఈరోజుల్లో మగవారికన్నా ఎక్కువగా ఆడవాళ్లు వ్యాపారాల్లో రానిస్తున్నారు.. ఇప్పుడు మనం చెప్పబోయే బిజినెస్ ఏంటంటే పేపర్ ప్లేట్స్ తయారీ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు..
గృహిణిలు, నిరుద్యోగులు కూడా ఈ వ్యాపారాన్ని ఎంతో సులువుగా చేయవచ్చు. ఈ వ్యాపారం చేయడానికి మొదట్లో.. కాస్త శ్రమించాల్సి ఉంటుంది. ఇక పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు. మనం పెట్టే పెట్టుబడికి అనుగుణంగా ఈ వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈ వ్యాపారం చేసేందుకు కావల్సిన పెట్టుబడి, ఇతర ఖర్చులు, లాభాల విషయానికి వస్తే.. పేపర్ ప్లేట్స్‌ను తయారు చేసే మెషిన్‌ను ముందుగా తీసుకోవాలి. ఈ మెషిన్‌లలో మూడు రకాలు ఉంటాయి. మొదటిది మ్యానువల్ మేకింగ్ మిషిన్. దీని ధర రూ.15 వేల నుండి రూ.20 వేల వరకు ఉంటుంది..
ఇక వీటిల్లో రెండోది సెమీ ఆటోమేటిక్ మెషిన్. దీని ధర రూ.40 వేల వరకు ఉంటుంది. మూడవది ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్. దీని ధర రూ. 1 లక్ష వరకు ఉంటుంది.. ఈ వ్యాపారం ప్రారంభించేవారికి రెండోది బెస్ట్ చాయిస్.. ఈ మెషిన్ వల్ల ముడి సరుకులతో మనం ఎంతో సులువుగా పేపర్ ప్లేట్స్‌ను చేసుకోవచ్చు.. రోజుకి మనం 8 గంటలు పని చేయడం వల్ల సుమారుగా 8 వేల పేపర్ ప్లేట్స్‌ను తయారు చేసుకోవచ్చు. ఒక్కో ప్లేటుపై అన్ని ఖర్చులు పోయిన తరువాత 15 పైసలు మిగులుతాయి. రోజుకి 8 వేల ప్లేట్లకు గాను అన్ని ఖర్చులు పోగా రూ.1200 మిగులుతాయి. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల రూ.1200 కంటే ఇంకా ఎక్కువ డబ్బులు మిగులుతాయి.. ఇలా చేస్తే మీకు నెలకు 36 వేలు మిగులుతుంది..
దీంతో 4 లేదా 5 రకాల ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. ఈ మిషిన్‌తో మనం ఇంట్లో కూడా ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. దీనికి అనుభవం ఉండాల్సిన పనిలేదు.. ఈ మెషిన్ సహాయంతో ఎవరైనా కూడా చాలా సులువుగా ప్లేట్లను తయారు చేయవచ్చు.. ఆర్డర్లు పెరిగేకొద్దీ లాభాలను కూడా పొందుతారు.. ఈ మెషిన్‌లు, పేపర్ ప్లేట్లను తయారు చేసేందుకు ఉపయోగపడే రా మెటీరియల్ ధరలు మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఎవరైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే మాత్రం మార్కెట్ లో అన్నీ తెలుసుకోవడం మంచిది..