Leading News Portal in Telugu

AP High Court: ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్


AP High Court: ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్

AP High Court: విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ ఘటనపై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులకు మెరుగైన పరిహారం అందించాలని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2020లో ఘటన జరిగినపుడు 15 మంది మృతి చెందారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పెను ప్రమాదాల్లో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఒకటి.. వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకై 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషవాయువు ధాటికి ఊపిరి అందక జనాలు రోడ్లపైనే కుప్పకూలిపోయారు. కళ్లెదుటే తమ వారిని బంధువులు కోల్పోయారు. ఈ ఘటన అందరినీ కలచి వేసింది. కళ్లారా చూస్తుండగానే ఊపరి అందకా పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అంతా కుప్ప కూలారు. అయితే ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన ప్రభుత్వం భారీగా నష్ట పరిహారం ప్రకటించింది. . విషవాయువు లీకై గ్రామానికి చెందిన 12 మంది ప్రమాదం జరిగిన రోజున మృతిచెందగా, మరో ముగ్గురు మరికొన్ని రోజుల తర్వాత మృతి చెందారు.