Leading News Portal in Telugu

Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. బయటకు వచ్చిన 10 మంది కార్మికులు..


Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. బయటకు వచ్చిన 10 మంది కార్మికులు..

Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. ర్యాట్-హోల్ మైనింగ్ ద్వారా టన్నెల్ లోపలికి మార్గాన్ని ఏర్పాటు చేసి, చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించడానికి ఆపరేషన్ నిర్వహించారు. తాజాగా కార్మికులు చిక్కుకుపోయిన ప్రదేశానికి రెస్క్యూ టీం చేరుకుంది. 17 రోజులుగా అందులో చిక్కుకుపోయిన కార్మికులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు కార్మికులను బయటకు తీసుకువచ్చారు. చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లేదా NDRF యొక్క మూడు బృందాలు సొరంగం లోపల ఉన్నాయి.