
తమిళనాడులోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి కేరళ వెళ్తుండగా బస్సులో మంటలు చెలరేగాయి. ధర్మపురి-సేలం జాతీయ రహదారిపై గెంగాళాపురం ప్రాంతంలో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే ఆ బస్సు అందరూ చూస్తుండగానే.. మంటల్లో దగ్ధమైంది. మరోవైపు దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు బృందం మరియు అంబులెన్స్‌తో సహా అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బస్సు మంటల్లో దగ్ధం కాగా.. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రమాదం జరిగిన వెంటనే కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.