Leading News Portal in Telugu

Rozgar Mela: ప్రధాని చేతుల మీదుగా 51,000 మందికి జాబ్ లెటర్స్..


Rozgar Mela: ప్రధాని చేతుల మీదుగా 51,000 మందికి జాబ్ లెటర్స్..

Rozgar Mela: ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరబోతున్న 51,000 మందికి ‘రోజ్‌గార్ యోజన’ కింద జాబ్ లెటర్స్‌ ఇవ్వబోతున్నారు. నవంబర్ 30న ప్రధాని చేతుల మీదుగా వారిందకిరి ఉద్యోగ నియామక పత్రాలను అందుకోనున్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న ఉద్యోగులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారని మంగళవారం పీఎం కార్యాలయం తెలిపింది. ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా దేశవ్యాప్తంగా 37 ప్రదేశాలలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నియామకాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

రెవెన్యూ, హోం వ్యవహరాలు, ఉన్నత విద్య, పాఠశాల విద్య, ఆర్థిక సేవలు, రక్షణ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం, కార్మిక-ఉపాధి శాఖల్లో వీరి నియామకం జరగనుంది. ‘‘రోజ్‌గార్ మేళా ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాన మంత్రి నిబద్ధత దిశగా ఒక అడుగు. ఇది మరింత ఉపాధి కల్పలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. యువతకు సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్థవంతమైన అవకాశాలను అందిస్తుంది’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.

కొత్త నియామకాలు వారి వినూత్న ఆలోచనలు, సామర్థ్యాలు దేశ పారిశ్రామిక, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని బలోపేతం చేసే పనిలో దోహదపడతాయని, అభివృద్ధి చెందిన భారతదేశంగా మోడీ ఆశయాన్ని సాకారం చేయడంలో సహాయపడతాయని పేర్కొంది. కొత్తగా నియమితులైనవారు ఐగోట్ కర్మయోగి పోర్టల్‌లోని ఆన్‌లైన్ మాడ్యూల్ అయిన ‘కర్మయోగి ప్రారంభ్’ ద్వారా శిక్షణ పొందే అవకాశాన్ని కూడా పొందుతారు. 800 కంటే ఎక్కువ ఈ లర్నింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.