
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో తన దుర్మార్గపు కార్యకలాపాల నుంచి పాకిస్తాన్ విరమించుకోవడం లేదు. అక్కడ నివసించే కాశ్మీరీ పండిట్లపై అఘాయిత్యాలకు పాల్పడే వార్తలు రోజు వస్తూనే ఉన్నాయి. తాజాగా.. పీఓకేలోని కాశ్మీరీ పండిట్ల ప్రధాన పుణ్యక్షేత్రమైన శారదా పీఠ్ ఆలయ గోడను పాకిస్తాన్ సైన్యం కూల్చివేసింది. అంతేకాకుండా.. ఆ స్థలంలో కాఫీ షాప్ నిర్మించారు. ఈ ఆలయానికి హిందూ మతంలో చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉన్నట్లుగా అక్కడి ప్రాంతవాసులు చెబుతున్నారు.
హింగ్లాజ్ మాత ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపు కూడా ఉంది. అలాంటి ఆలయం గోడను కూల్చివేసి కాఫీ హౌస్ ను నిర్మిస్తున్నారు. దీంతో కశ్మీరీ పండిట్ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆలయ కూల్చివేతపై పీఓకే ప్రాంత వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ కాఫీ హౌస్ ను ఈ ఏడాదిలోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం. దేశంలో హిందువులపై జరుగుతున్న అణచివేతను ఇలాంటి ఘటనలే ఎత్తి చూపుతున్నాయి.
కాగా.. 1947 తర్వాత తొలిసారిగా కాశ్మీర్‌లోని తిత్వాల్‌లోని శారదా మాత ఆలయంలో దీపావళి పూజలు జరిగాయి. శారదా పీఠం.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కిషన్‌గంగా నది (నీలం నది) ఒడ్డున ఉంది. ఈ ఆలయంపై భారతదేశానికి హక్కు ఉంది. అంతేకాకుండా.. శారదా పీఠ్ ఆలయం కాశ్మీరీ పండిట్ల విశ్వాసానికి చిహ్నంగా ఉంది. కానీ ప్రస్తుతం.. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోగా.. ఈ ఆలయం ప్రధాన శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.