Leading News Portal in Telugu

Andhra Pradesh: పరిశ్రమల ఏర్పాటుపై జగన్ సర్కార్ ఫోకస్..


Andhra Pradesh: పరిశ్రమల ఏర్పాటుపై జగన్ సర్కార్ ఫోకస్..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిపెట్టింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. మంగళవారం 6 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు సీఎం జగన్. ఇక.. ఇవాళ అంటే వరుసగా రెండోరోజు కూడా.. ఏపీ సీఎం జగన్.. పలు పరిశ్రమలకు శంకుస్థానలు చేయనున్నారు.. అలాగే.. మరికొన్నింటిని ప్రారంభిస్తారు. వరుసగా రెండో రోజు పలు పరిశ్రమల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు సీఎం.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈ రోజు ఉదయం 11 గంటలకు వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.. ఇవాళ 1,072 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు సీఎం జగన్‌.. మరోవైపు.. రేపు నంద్యాల, కడప జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకోనున్నారు. అవుకు రెండో టన్నెల్ నుంచి నీటి పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిపెట్టింది ఏపీ సర్కార్.. ఆ తర్వాత ఆయన కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.. కడపలో పెద్ద దర్గాను దర్శించుకుని.. తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.