Leading News Portal in Telugu

AP High Court: హైకోర్టులో నేడు చంద్రబాబు కేసులపై విచారణ..


AP High Court: హైకోర్టులో నేడు చంద్రబాబు కేసులపై విచారణ..

AP High Court: ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చంద్రబాబు కేసులపై విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేయనుంది న్యాయస్థానం. అయితే, చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దని ఇప్పటికే 470 పేజీలతో అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేసింది.. సీఐడీ. అటు అమరావతి అసైన్డ్ భూములు కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ ఇతరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు మీద విచారణ జరగనుంది.

మరోవైపు స్కిల్‌ కేసులో చంద్రబాబుకు ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సవాల్ చేసింది. దీనిపై విచారణను జరిపిన ధర్మాసనం.. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. అలాగే హైకోర్టు ఇచ్చిన షరతుల్లో మార్పులు చేస్తూ.. నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు పబ్లిక్‌ మీటింగ్‌లకు హాజరు కావొచ్చని తెలిపింది. అయితే.. కేసు గురించి మాత్రం మాట్లాడవద్దని ఆదేశించింది అత్యున్నత ధర్మాసనం. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ సీఐడీ.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్‌ చేయగా.. 50 రోజులకు పైగా ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అనారోగ్య సమస్యల కారణంగా ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ కూడా మంజూరు చేసిన విషయం విదితమే.