Leading News Portal in Telugu

Massive Robbery: చెన్నైలో చేతివాటం చూపిన దొంగలు.. జోయాలక్కాస్ నగల దుకాణంలో భారీ చోరీ


Massive Robbery: చెన్నైలో చేతివాటం చూపిన దొంగలు.. జోయాలక్కాస్ నగల దుకాణంలో భారీ చోరీ

Chennai: కష్టపడకుండా ఇతరులు కష్టపడి సంపాదించిన సొమ్మును కాజేసి కడుపు నింపుకోవాలి అనుకోవడం అమానుషం. అయితే కొందరు వ్యక్తులు మాత్రం దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతుంటారు. దొరికితే పరువు పోతుంది.. శిక్ష పడుతుంది అని తెలిసినా కొందరు దొంగలు వాళ్ళ పంథా మాత్రం మార్చుకోవడం లేదు. దొరికితేనేగా దొంగ.. దొరికే వరకు దొరనే అనుకుంటున్నారు. దొరకమనే ధీమాతో దొంగతనాలకు పాలపడుతున్నారు. ఇళ్ల లోనే కాదు ప్రముఖ నగల దుఖాణం లోను చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడు లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో దొంగలు చేతివాటం చూపించారు.

Read also:CM YS Jagan: క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌..

వివరాల లోకి వెళ్తే.. చెన్నై లోని కోయంబత్తూరు లోని గాంధీపురం లో ఉన్న జోయాలక్కాస్ నగల దుకాణంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. దుకాణానికి అమర్చి ఉన్న ఏసీ వెంటిలేటర్ ద్వారా దొంగలు దుకాణం లోకి ప్రవేశించారు. అనంతరం దుకాణంలో నుండి 2 కేజీల బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి, నగలు ఎత్తుకెళ్లారు. దుకాణంలో దొగతనం జరిగినట్టుగా గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని పరీశీలించారు. అనంతరం దుకాణం సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.