
Bihar: బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో దారుణం జరిగింది. స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఇద్దరు నర్సరీ విద్యార్థినులపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పాఠశాల ముగించుకుని ఇంటికి విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అప్పటికే అందరు విద్యార్థులను వారి ఇళ్ల వద్ద వదిలిని డ్రైవర్, చివరకు ఇద్దరు నర్సరీ విద్యార్థినులు ఉంటడంతో వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.
విద్యార్థినులు ఇంటికి చేరుకున్న తర్వాత జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో గ్రామస్తుల సాయంతో వ్యాన్ డ్రైవర్ని పట్టుకుని కొట్టారు. అంతటితో ఆగకుండా వ్యాన్‌కి నిప్పుపెట్టారు. ప్రస్తుతం నిందితుడైన డ్రైవర్నిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆధారాలను సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు బాలికలు బెగుసరాయ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు గత మూడేళ్లుగా వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవలని డిమాండ్ చేస్తున్నారని డీఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు.