Leading News Portal in Telugu

Bandaru Vijayalakshmi: బీజేపీ అధికార ప్రతినిధిగా బండారు విజయలక్ష్మీ..


Bandaru Vijayalakshmi: బీజేపీ అధికార ప్రతినిధిగా బండారు విజయలక్ష్మీ..

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నియమించారు. బీజేపీ పార్టీ సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో ఆమె వ్యవహరిస్తారు అని ఆయన పేర్కొన్నారు. సహచర కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా విజయలక్ష్మీ పాల్గొంటుంది అని తెలంగాణ బీజేపీ పార్టీ చెప్పుకొచ్చింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచి అన్ని వర్గాలలో బీజేపీ పార్టీని మరింత విస్తరించడానికి కృషి చేయాలని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బండారు విజయలక్ష్మీ తెలంగాణ బీజేపీ పార్టీ అభివృద్దికి మరింత కృషి చేయాలని ఆయన సూచించారు.