
US: అమెరికా లో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుని హత్య చేసేందుకు భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తా(52) ప్లాన్ చేశారని అమెరికా ఆరోపిస్తూ న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టులో నిఖిల్ గుప్తాపై కేసు నమోదు చేసింది. వివరాలలోకి వెళ్తే.. న్యూయార్క్‌లో నివాసం ఉంటున్న అమెరికా పౌరుడిని హత్య చేసేందుకు కుట్ర చేసారని.. ఈ కుట్రలో భాగంగా అమెరికా పౌరుడిని హతమార్చేందుకు ఓ కిల్లర్‌ను నియమించుకున్నాడని.. హత్య చేసేందుకు గాను కిల్లర్ కి లక్ష డాలర్లు ఇచేలా ఒప్పందం చేసుకున్నాడని అమెరికా అభియోగం మోపుతూ కేసు నమోదు చేసింది.కాగా అమెరికా ప్రభుత్వ న్యాయవాదులు దాఖలు చేసిన అభియోగపత్రంలో అమెరికా పౌరుడి పేరును ప్రస్తావించలేదు.. ఆ పేరుకు బదులుగా.. ఖలిస్తాని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ న్నూ హత్య చేసుందుకు కుట్ర చేయగా ఆ కుట్రను US అధికారులు భగ్నం చేశారని అంతర్జాతీయ మాధ్యమాలు నివేంధించాయి.
Read also:MLC Kavitha: ఓటేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
ఈ నేపథ్యంలో US అటార్నీ న్యూయార్క్ యొక్క సదరన్ డిస్ట్రిక్ట్ మాథ్యూ జి. ఒల్సేన్ మాట్లాడుతూ అమెరికా గడ్డపై సిక్కు వేర్పాటువాదిని హత్య చేసేందుకు గాను భారతీయ పౌరుడు కుట్ర చేయగా ఆ కుట్రను అమెరికా అధికారులు భగ్నం చేసారని.. కాగా అమెరికా గడ్డ పైన అమెరికా నివాసిని హత్య చేసేందుకు ప్రయతించినందుకు, అలానే కిరాయికి కిల్లర్ ను నియమించుకున్నందుకుగాను గుప్తాకు 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని పేర్కొన్నారు. కాగా బుధవారం న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోసం US డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో రద్దు చేయబడిన సూపర్‌సీడింగ్ నేరారోపణ అలానే ఇతర పబ్లిక్ కోర్టు పత్రాలును పరిశీలించారు. కాగా ఈ ఆరోపణల పైన ఇంకా స్పష్టత రాలేదు.. ఈ నేపథ్యంలో భారతదేశం నవంబర్ 18 వ తేదీన ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.