Leading News Portal in Telugu

CM KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్‌.. రెండు చోట్ల గట్టి ప్రత్యర్థులే!


CM KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్‌.. రెండు చోట్ల గట్టి ప్రత్యర్థులే!

CM KCR Cast His Vote: తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్‌ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన కేసీఆర్‌.. తన ఓటు వేశారు. ప్రస్తుతం చింతమడకలో భారీగా ఓటర్లు క్యూ లైన్‌లో ఉన్నారు. ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రానికి రాని ఓటర్లు.. సీఎం వచ్చే టైంలోనే ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి సీఎం పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో సీఎం ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉండగా.. కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఉండడం ఆసక్తిగా మారింది. రెండు చోట్ల సీఎంకు గట్టి ప్రత్యర్థులే ఉండడంతో.. ఈ నియోజకవర్గ ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఉన్నారు.